60 అడుగుల ఎత్తు నుండి జలపాతంలోకి స్నేహితురాలిని తోసింది

By narsimha lodeFirst Published 12, Aug 2018, 4:23 PM IST
Highlights

:విహారయాత్రలో  జలపాతం  వద్ద  స్నేహితురాలిని  తోసేసింది. దీంతో జలపాతం అందాలను చూస్తున్న 16 ఏళ్ల యువతి జలపాతంలో పడిపోయింది. 60 అడుగుల పై నుండి  కిందకు పడింది.


వాషింగ్టన్:విహారయాత్రలో  జలపాతం  వద్ద  స్నేహితురాలిని  తోసేసింది. దీంతో జలపాతం అందాలను చూస్తున్న 16 ఏళ్ల యువతి జలపాతంలో పడిపోయింది. 60 అడుగుల పై నుండి  కిందకు పడింది.

విహారయాత్రలో  స్నేహితురాలు చేసిన  పనికి  బాధితురాలు  తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వాషింగ్టన్ యాక్టోల్‌లోని మౌల్టన్ జలపాతాన్ని సందర్శించడానికి 16 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి వెళ్లింది.

జలపాతం పై ఉన్న బ్రిడ్జి అంచున  నిలబడి ఆమె జలపాతం అందాలను చూస్తుంది. అయితే ఆమె వెనుకనే నిల్చున్న స్నేహితురాలు ఒక్కసారిగా  ఆమెను జలపాతంలోకి తోసేసింది.  60 అడుగులపై నుండి  కిందకు పడిపోయింది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనలో  బాధితురాలికి 5 పక్కటెముకలు విరిగాయి. ఊపిరితిత్తులు కూడ దెబ్బతిన్నాయని కుటుంబసభ్యలు  తెలిపారు. తమ కూతురు కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. 

తన కూతురును ఆమె స్నేహితురాలు చంపే ప్రయత్నం చేసిందన్నారు. జలపాతం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.  జలపాతంలోకి దూకితే ప్రమాదమని అదికారులు హెచ్చరిస్తున్నారు.


 

Last Updated 9, Sep 2018, 12:24 PM IST