లోదుస్తులు తప్పనిసరిగా ధరించాలి.. విమాన సిబ్బందికి జారీ చేసిన సూచనలు వివాదాస్పదం.. వివరణ ఇచ్చిన సంస్థ

By Mahesh KFirst Published Oct 1, 2022, 12:35 AM IST
Highlights

పాకిస్తాన్ ప్రభుత్వ వైమానిక సంస్థ పీఐఏ గురువారం చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది. విమాన క్రూ లో దుస్తులు తప్పకుండా ధరించాలని ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) గురువారం జారీ చేసిన డ్రెస్ కోడ్ అడ్వైజరీ వివాదాస్పదం అయింది. అందులో లోదుస్తులు తప్పనిసరిగా ధరించాలని, లేదంటే.. ఆ వ్యక్తితోపాటు సంస్థ పరువు కూడా పోతుందని పేర్కొంది. కాబట్టి, సరైన దుస్తులతోపాటు లోదుస్తులూ ధరించాలని సూచించింది. ఈ సూచనలపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వ వైమానిక సంస్థ పీఐఏ ఓ వివరణ ఇచ్చింది.

విమాన సిబ్బందికి పీఐఏ గురువారం ఓ అడ్వైజరీ జారీ చేసింది. యూనిఫామ్ లోపల తప్పకుండా సరైన లోదుస్తులు వాడాలని అందులో పేర్కొంది. సరైన డ్రెస్సింగ్ విధానం లేని కారణంగా సంస్థ పైనే నెగెటివ్ ఇమేజ్ పడుతుందని తెలిపింది. 

ఈ అడ్వైజరీ విమర్శలపాలైంది. ఇది సరి కాదని చాలా మంది విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే జాతీయ వైమానిక సంస్థ పీఐఏ వివరణ ఇచ్చింది. తన అడ్వైజరీని వెనక్కి తీసుకుంది. కేవలం 24 గంటల్లోనే ముందటి ప్రకటన ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేసింది. 

మంచి డ్రెస్ కోడ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ అడ్వైజరీ విడుదల చేశామని, కానీ, పదాల కూర్పు సరిగా ఉండాల్సిందని పేర్కొన్నారు. ఆ అడ్వైజరీలోనే పదాలు తప్పుగా ఎంచుకున్నారని తెలిపారు. అందులోని పదాలు మరింత నాగరికంగా ఉండాల్సినవని భావించినట్టు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

click me!