ఘోర ప్రమాదం: రైలులో మంటలకు 65 మంది సజీవ దహనం

By narsimha lodeFirst Published Oct 31, 2019, 11:07 AM IST
Highlights

పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. రైలు బోగీలో  మంటలు వ్యాపించడంతో 65 మంది సజీవ దహనమయ్యారు. 

పాకిస్తాన్‌లో గురువారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. రైలు బోగీల్లో మంటలు వ్యాపించి 65 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తల్వారీ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత  లియాఖత్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రైలులోని  కిచెన్‌లో బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం వాటిలినట్టుగా ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

దీంతో రైలులో మంటలు వ్యాపించాయి. మంటలు ఏకంగా మూడు బోగీలకు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో భారీ స్థాయిలో  ప్రాణనష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు ప్రకటించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

65 మంది సజీవ సమాధి కావడంతో పాటు పలువురు  తీవ్రంగా గాయపడినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు. రైలులో ప్రయాణం చేసే సమయంలో  రైలులోనే భోజన వసతిని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే రైలు బోగీల్లో బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. 

జిల్లా ఉన్నతాధికారి బకీర్ హుస్సేన్ నేతృత్వంలో అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో జరిగిన రైలు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. సెప్టెంబర్ మాసంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

2005లో జరిగిన రైలు ప్రమాదంలో 130 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో చోటు చేసుకొంది. పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు.

గురువారం నాడు జరిగిన రైలు ప్రమాదంలో 46 మంది సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో గాయాపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం రైల్వే అధికారులను ఆదేశించింది.

also read:బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే

ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే శాఖాధికారులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొన్నారు. స్థానికులు కూడ ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. 

ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను మళ్లించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలులో మూడు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి.మిగిలిన బోగీలకు మంటలు వ్యాపించకుండా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది.

 

click me!