ఇంటిపై కూలిన విమానం... ఒకరి మృతి

Published : Oct 31, 2019, 08:31 AM IST
ఇంటిపై కూలిన విమానం... ఒకరి మృతి

సారాంశం

అట్లాంటా పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చారు.కూలిపోయిన పీపర్ పీఏ -28 బుల్లి విమానం సింగిల్ ఇంజన్ తో ఉందని వైమానిక శాఖ అధికారులు చెప్పారు.

అపార్ట్ మెంట్ పై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పీపర్ పీఏ-28 నంబరు గల చిన్న విమానం ఛాంబ్లీ నగరంలోని డెకల్బ్ పీచట్రీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ అపార్టుమెంటుపై కుప్పకూలింది. వాతావరణం అనుకూలించక పోవడంతోపాటు మబ్బులు కమ్ముకోవడంతో చిన్న విమానం ఎగురుతూ కూలిపోయిందని ఫెడరల్ ఏవీయేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికార ప్రతినిధి కత్లీన్ బెర్గెన్ చెప్పారు.

 ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు  చెబుతున్నారు. ఎంతమంది మరణించారనేది ఇంకా క్లారిటీ రాలేదు.  అట్లాంటా పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చారు.కూలిపోయిన పీపర్ పీఏ -28 బుల్లి విమానం సింగిల్ ఇంజన్ తో ఉందని వైమానిక శాఖ అధికారులు చెప్పారు.

ఇలాంటి సంఘటనలు అమెరికాలో గతంలో కూడా జరిగాయి. కొద్ది రోజుల క్రితం... దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం.. ప్రమాదవశాత్తు ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకే కుప్పకూలిందని చెప్పారు. పొపయన్ నగర శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లల్లో  ఎవరూ లేకపోవడంతో...పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

కాగా...ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో
Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?