వణికిన మొరాకో.. 2,012కి చేరిన మృతుల సంఖ్య..  ఎటు చూసిన శవాల దిబ్బలు.. శిథిలాల కుప్పలు..

By Rajesh Karampoori  |  First Published Sep 10, 2023, 5:35 AM IST

ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.
 


ఆఫ్రికా దేశమైన మొరాకోలో  శుక్రవారం అర్థరాత్రి సంభవించిన విధ్వంసక భూకంపంలో రెండు వేయి మందికి పైగా మరణించారు. తాజా సమాచారం ప్రకారం..  భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,012 కు చేరింది. అలాగే.. 2,059 మందికి పైగా గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.   మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.  

అర్థరాత్రి వేళ భూకంపం రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను మొరాకన్లు  తన సోషల్ మీడియాలో  పంచుకున్నారు. అందులో భవనాలు కూలిపోయి శిధిలాలుగా మారడం. చుట్టూ దుమ్ము అవరించడం చూడవచ్చు. మరకేష్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ కట్టాడాలు దెబ్బతిన్నాయి. యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) వరల్డ్ హెరిటేజ్ సైట్‌ల జాబితాలో మరకేష్ చేర్చబడింది.

Latest Videos

భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పట్టణ అధిపతి మొరాకన్ మీడియాతో మాట్లాడుతూ సమీపంలోని పట్టణాల్లోని అనేక ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా కూలిపోయాయని, కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనీ, రోడ్లు మూసుకుపోయాయని చెప్పారు.

తలాత్ న్ యాకూబ్ నగర అధిపతి అబ్దర్‌రహీమ్ ఐత్ దౌద్ మాట్లాడుతూ.. అధికారులు ప్రావిన్స్‌లో రోడ్లను క్లియర్ చేస్తున్నారని,  అంబులెన్స్‌లు వెళ్లి బాధిత జనాభాకు సహాయం అందించవచ్చని చెప్పారు.  భూకంప కేంద్రం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. మొరాకో సైనిక, అత్యవసర సిబ్బంది దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భూకంప కేంద్రం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతంలోకి వెళ్లే రహదారుల్లో శిధిలాలు, రాళ్లు పడటంతో సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. రెస్క్యూ కార్యకలాపాలు మందగించాయి.  

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి…

మొరాకో భూకంపం పై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జి20 ప్రారంభోపన్యాసంలో మోడీ పిలుపునిచ్చారు.

మొరాకో భూకంపం పై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ..మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో మొరాకో ప్రజలకు నా సానుభూతి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అని పోస్టు చేశారు. 

జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మొరాకోకు సంతాపం తెలిపారు. UN ప్రతినిధి మాట్లాడుతూ..భూకంప ప్రభావిత జనాభాకు సహాయం చేయడానికి మొరాకో ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉందని ప్రకటించారు.  

US జియోలాజికల్ సర్వే (USGS) రాత్రి 11:11 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. పలు సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. 19 నిమిషాల వ్యవధిలో  4.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యుఎస్ ఏజెన్సీ నివేదించింది.

శుక్రవారం నాటి భూకంప కేంద్రం మరకేష్‌కు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ నగరంలో ఉంది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఉంది.  

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్‌లోని సీస్మిక్ మానిటరింగ్ వార్నింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ లహ్కన్ మ్హన్నీ స్థానిక మీడియతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని చెప్పారు. 1960లో మొరాకోలోని అగాదిర్ నగరానికి సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీనిలో వేలాది మంది మరణించారు. ఈ భూకంపం తర్వాత మొరాకోలో భవన నిర్మాణ నియమాలు మార్చబడ్డాయి. అయితే చాలా భవనాలు, ముఖ్యంగా గ్రామాల్లోని ఇళ్లు భూకంపాన్ని తట్టుకోలేవు. 2004లో మధ్యధరా తీర నగరమైన అల్ హోసీమాలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 600 మందికి పైగా మరణించారు. 

click me!