OpenAI CEO లవ్ మ్యారేజ్ .. ఎవర్నీపెళ్లి చేసుకున్నాడో తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే..!

Published : Jan 12, 2024, 12:08 AM IST
OpenAI CEO లవ్ మ్యారేజ్ .. ఎవర్నీపెళ్లి చేసుకున్నాడో తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే..!

సారాంశం

ప్రముఖ  OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్..  తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక ఆల్ట్‌మన్ నివాసంలో ఆడంబరాలకు దూరంగా సాధారణ వేడుకలా జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 

OpenAI సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman)మరో సారి వార్తల్లోకెక్కారు.  OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక బుధవారం హవాయిలో జరిగింది. వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.వీరి వివాహానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, అలెగ్జాండర్ వాంగ్, షెర్విన్ పిషెవర్, జేన్ మతోషి, అడ్రియన్ ఔన్ ఉన్నారు. 

ఆలివర్ ముల్హెరిన్ ఎవరు?

సామ్ ఆల్ట్‌మాన్ జీవిత భాగస్వామి ఆలివర్ ముల్హెరిన్‌ను ఒల్లీ అని కూడా పిలుస్తారు. సామ్‌,ఆలివర్ ల స్నేహం చాలా పాతదే. ఆలివర్ ముల్హెరిన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) రంగంలో అతనికి నైపుణ్యం ఉంది. అదనంగా.. ఆలివర్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు వివిధ AI ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు.

గతేడాది వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో వీరిద్దరూ తొలిసారి జంటగా కనిపించారు. సామ్ ఆల్ట్‌మన్, ఆలివర్ ముల్హెరిన్ మధ్య స్నేహం చాలా పాతదదే. వీరి వివాహ వేడుక ఆల్ట్‌మన్ నివాసంలో ఆడంబరాలకు దూరంగా సాధారణ వేడుకలా జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.  వైట్‌హౌస్ విందులో ఆయన బహిరంగంగా కనిపించారు. వీరి వేడుకకు సత్య, అను నాదెళ్ల, సుందర్ ,  అంజలి పిచాయ్‌తో సహా చాలా పలువురు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే