Open AI : మళ్లీ సీఈవోగా తిరిగొచ్చిన సామ్ ఆల్ట్ మన్.. బోర్డు సభ్యులకు ఉద్వాసన...

By SumaBala Bukka  |  First Published Nov 23, 2023, 12:51 PM IST

రెబల్స్ కు షాక్ ఇచ్చాడు ఆల్ట్ మన్. తిరిగి ఓపెన్ ఏఐలోకి రెట్టించిన బలంతో అడుగుపెట్టాడు. 


ఓపెన్ ఏఐ ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకతలు, రెబల్ నిరసనల మధ్య తొలగించిన ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ సామ్ ఆల్ట్‌మాన్ ను కంపెనీ తిరిగి సీఈవోగా నియమించింది. దీంతో మంగళవారం అర్థరాత్రి ఓపెన్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సామ్ ఆల్ట్‌మాన్ షాక్ తిరిగి ఆఫీసులు అడుగుపెట్టాడు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ హెడ్ ఆఫీస్ దగ్గర ఉద్విగ్న క్షణాలు నెలకొన్నాయి. 

ఓపెన్ ఏకి తిరిగి సీఈవోగా వచ్చిన తర్వాత సామ్ ఆల్ట్ మన్ మాట్లాడుతూ..  ‘నేను ఓపెన్ ఏఐని ఎంతగానో ప్రేమిస్తున్నాను. గత కొద్ది రోజులుగా  నేను చేసిందంతా ఈ బృందాన్ని ఒకచోట చేర్చడం కోసమే’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అప్పటివరకు సామ్ ఆల్ట్ మన్ ఓపెన్ ఏఐకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా తిరిగి వస్తున్నట్లుగా వస్తున్న ఊహగానాలకు చెక్ పెట్టినట్లయ్యింది.  ఆయన   తిరిగి వస్తున్నట్లు  ధ్రువీకరించినట్లయింది. 

Latest Videos

undefined

సామ్ ఆల్ట్ మన్ పునరాగమనం కోసం ఓపెన్ ఏఐ తన బోర్డులోని చాలామందిని తొలగించింది. మాజీ సేల్స్ ఫోర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రెట్ టేలర్, మాజీ యుఎస్  ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, కోరా వ్యవస్థాపకుడు ఆడమ్ డి ఏంజెలో స్టార్టప్ లోని మారిన కొత్త బోర్డులో చేరుతున్నారు. స్టార్టపు బోర్డు చైర్మన్గా టైలర్ వ్యవహరించనున్నారు. ఓపెన్ ఏఐ స్టార్టప్ లో మైక్రోసాఫ్ట్ 49 శాతం వాటా కలిగి ఉంది. గత వారం జరిగిన ఈ పరిణామాలతో మైక్రోసాఫ్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు వెంటనే మైక్రోసాఫ్ట్ లో సామ్ ఆల్ట్ మన్ నియామకాన్ని ప్రకటించింది. 

ఆ తరువాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి సామ్ ఆల్ట్ మన్ స్తానంలో కొత్త సీఈవోను నియమించారు. కంపెనీలో మరో వ్యవస్థాపక భాగస్వామి తప్పుకున్నాడు. ఇవన్నీ కారణాలతో మళ్లీ సామ్ తిరిగి ఏఐలోకి అడుగుపెట్టాడు. 

click me!