
ఆమెరికాలో (america)ని వర్జీనియా (varginia) ప్రాంతంలోని హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.
వర్జీనియా టెక్ (varginia) సమీపంలోని హుక్కా లాంజ్ (hukka laang) ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11:53 గంటలకు కాల్పులు జరిగాయని బ్లాక్స్‌బర్గ్ (blacks burg) పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురిపై దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు ధృవీకరించారు. అయితే వారిని హాస్పిటల్ కు తరలించారు. అందులో ఒకరు పరిస్థితి విషమించి మృతి చెందగా.. మరో నలుగురు ప్రస్తుతం ట్రీట్ మెంట్ పొందుతున్నారు.
గాయపడిన వారిలో ఒకరు వర్జీనియా టెక్ విద్యార్థి అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ టిమ్ సాండ్స్ (tim sands) పేర్కొన్నారు. ఆయనకు ప్రస్తుతం సర్జరీ పూర్తయ్యిందని, కోలుకుంటున్నాడని ఆయన తెలిపారు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు, బంధువులకు తన సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి తాము పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కాల్పుల కారణంగా అనేక గంటలపాటు వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రాంతంలో లాక్‌డౌన్ (lock down)ను విధించారు. శనివారం తెల్లవారుజామున 3:18 గంటలకు క్యాంపస్ సురక్షితంగా ఉందని ప్రకటించారు. ఏప్రిల్ 2007లో వర్జీనియా టెక్ వద్ద జరిగిన కాల్పుల్లో 32 మంది మరణించారు. అయితే వారి మరణానికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారక చిహ్నానికి ఒక మైలు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకరం. అయితే ఈ ఘటనపై పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (enfocement agency)లు దర్యాప్తు జరుపుతున్నాయని, వాటి నివేదికలు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని బ్లాక్స్‌బర్గ్ పోలీసులు శనివారం తెలిపారు.