కొలంబోలో మరో బాంబు పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

Published : Apr 24, 2019, 12:38 PM IST
కొలంబోలో మరో బాంబు పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

సారాంశం

శ్రీలంక రాజధాని కొలంబోలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటికే వరస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్నారు. కాగా.. మరో పేలుడు సంభవించింది.

శ్రీలంక రాజధాని కొలంబోలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటికే వరస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్నారు. కాగా.. మరో పేలుడు సంభవించింది. ఈ సారి ఉగ్రవాదులు సినిమా థియేటర్‌ను టార్గెట్ చేసుకున్నారు. మోటర్ బైక్‌లో పేలుడు పదార్థాలు పెట్టి... పేలుడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.

 శ్రీలంకలో ఈస్టర్‌ పర్వదినం రోజున జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 360 దాటినట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. 500మందికిపైగా గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి 60 మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !