శ్రీలంక ఉగ్రదాడి.. తమపనేనంటున్న ఇస్లామిక్ స్టేట్

By telugu teamFirst Published Apr 23, 2019, 4:50 PM IST
Highlights

శ్రీలంకలో వరస బాంబు పేలుళ్లు మారణ హోమం సృష్టించాయి. ఇప్పటి వరకు 320మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ తాజాగా ప్రకటించింది. 

 శ్రీలంకలో వరస బాంబు పేలుళ్లు మారణ హోమం సృష్టించాయి. ఇప్పటి వరకు 320మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ తాజాగా ప్రకటించింది. మారణహోమం జరిగిన రెండు రోజుల తర్వాత ఇస్లామిక్ స్టేట్  ఈ ప్రకటన చేసింది.

అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. వరస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 321 మంది ప్రాణాలు పోగా..500మందికి పైగా గాయాలపాలయ్యారు.

మృతి చెందిన వారిలో 10 మంది భార‌తీయులు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాడుల వెన‌క నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్‌(ఎన్టీజే) ఉగ్ర‌వాద సంస్థ హ‌స్తం ఉన్న‌ట్లు శ్రీలంక ప్ర‌భుత్వం భావించింది. అయితే.. అనూహ్యంగా ఇది తమ ఘనకార్యమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. 

click me!