బిల్డింగ్ పై కూలిన హెలికాప్టర్

Published : Jun 11, 2019, 09:51 AM IST
బిల్డింగ్ పై కూలిన హెలికాప్టర్

సారాంశం

బహుళ అంతస్థు భవనంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుంది. కాగా.... ఈ ఘటన ఉగ్రవాదుల దాడులేమోననే భయంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. 

బహుళ అంతస్థు భవనంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుంది. కాగా.... ఈ ఘటన ఉగ్రవాదుల దాడులేమోననే భయంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే... అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు వివరించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం మాన్‌హాటన్‌లోని 51 అంతస్థుల భవనంపై  బిల్డింగ్‌పై చాపర్ ఒక్కసారిగా కూలడంతో  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.  దీంతో 2001, సెప్టెంబర్ 11 తరహా  దాడులా  అన్న భయాందోళనలతో  అందరు వణికిపోయారు. ఈ ప్రమాదంలో పైలట్  అక్కడికక్కడే మృతి చెందాడు.

హెలికాప్టర్ కూలడంతో  మొత్తం భవనం కంపించిపోయిందని భవనంలో నివాసం ఉంటున్నవారు చెప్పారు.  భవనం కొంతమేర ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.  ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటన జరిగిన వెంటనే భవనంలోని కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఖాళీ చేయించారు. 
హెలికాప్టరు కూలిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక జరిగిన ప్రమాదమని పోలీసులు తేల‍్చడంతో​ అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. అయితే  హెలికాప్టరు  మంటల్లో కాలి బూడిదగా మారింది. హెలికాప్టర్‌లో పైలట్‌  ఒక్కరే ప్రయాణిస్తున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే