హెల్మెట్, సీటు బెల్ట్ లేదని కాదు.. అందంగా ఉందని చలానా

Siva Kodati |  
Published : Jun 10, 2019, 07:45 AM IST
హెల్మెట్, సీటు బెల్ట్ లేదని కాదు.. అందంగా ఉందని చలానా

సారాంశం

ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి... అమ్మాయి అందంగా ఉందని చెప్పి చలానా రాశాడు. 

అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకోసం తమ వృత్తిని సైతం వాడుకుంటారు. కొంతమంది తాను ఫలానా జాబ్ చేస్తున్నానని.. లేని ఉద్యోగాన్ని, ఉన్నట్లుగా చూపిస్తారు.

ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి... అమ్మాయి అందంగా ఉందని చెప్పి చలానా రాశాడు. వివరాల్లోకి వెళితే.. ఉరుగ్వేలోని పెసందే ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి ఓ యువతి కనిపించింది.

వెంటనే ఆమెను ఆపి.. చలానా రాశాడు. హెల్మెట్ లేదనో రాస్తే అనుకోవచ్చు. కానీ కేవలం అందంగా ఉందని యువతికి చలానా రాశాడు. పబ్లిక్ రోడ్లపై అందగత్తె (ఎక్సెసివ్ బ్యూటీ ఆన్ పబ్లిక్ రోడ్స్) అంటూ చలానాలో పేర్కొన్నాడు.

ఆ చలానాను యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది ఒక్కసారిగా వైరల్ అవ్వడం.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం జరిగిపోయింది. సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ