అమెరికాపై చైనా కరోనా విమర్శలు: యానిమెటేడ్ వీడియోపై నెటిజన్ల ఫైర్

By narsimha lodeFirst Published May 1, 2020, 6:04 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా అమెరికా, చైనాల మద్య ప్రతి రోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చూస్తూనే ఉన్నాం. చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటికాలిపై లేస్తున్నాడు. చైనాపై జర్మనీ పరిహారం కూడ కోరింది. అమెరికా కూడ పరిహారం కోరనున్నట్టుగా ప్రకటించింది.
 


బీజింగ్: కరోనా వైరస్ కారణంగా అమెరికా, చైనాల మద్య ప్రతి రోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చూస్తూనే ఉన్నాం. చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటికాలిపై లేస్తున్నాడు. చైనాపై జర్మనీ పరిహారం కూడ కోరింది. అమెరికా కూడ పరిహారం కోరనున్నట్టుగా ప్రకటించింది.

ఈ తరహా ఘటనల నేపథ్యంలో చైనా ప్రతినిధులు వన్స్ అపాన్ ఏ వైరస్ అనే నినాదంతో అమెరికాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఫ్రాన్స్ లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధులు ఈ వీడియోను షేర్ చేశారు. 39 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో  అమెరికా గురించి విమర్శలు ఉన్నాయి. యానిమేటేడ్ వీడియోలో తమ దేశం అభిప్రాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు.

also read:మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహచరి

డిసెంబర్ మాసంలో అపరిచిత న్యూమోనియా బయటపడిన విషయాన్ని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని వీడియోలో ప్రకటించింది. జనవరిలో కొత్త వైరస్ పుట్టిందని, ఇది ప్రమాదకరమని చెప్పినట్టుగా తెలిపింది. అయితే ఈ వైరస్ కారణంగా సాధారణ ఫ్లూ మాత్రమే వస్తోందని అమెరికా కొట్టివేసిందని ఈ వీడియోలో తెలిపారు.

మాస్కులు ధరించాలని సూచిస్తే పట్టించుకోలేదని,, ఇంట్లోనే ఉండాలంటే హక్కుల ఉల్లంఘన అంటూ నానా యాగీ చేశారని ఆ వీడియోలో ప్రకటించారు. తాత్కాలిక ఆసుపత్రులు నిర్మిస్తే హంగామా చేస్తున్నారని విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఏప్రిల్ నాటికి కరోనా విషయంలో అమెరికా చైనాను నిందిస్తోందని చైనా ఆ వీడియోలో ఆరోపణలు చేసింది.

ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోవడానికి చైనానే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టిందన్నారు. ప్రాణాంతక వైరస్ అని తెలిస్తే అంతర్జాతీయ ప్రయాణాలను ఎందుకు నిలిపివేయలేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 

click me!