WHO: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి తగ్గుముఖం పడుతోందనీ, కానీ, సబ్ వేరియంట్ల వ్యాప్తి ఆందోళన కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. వైరస్ వృద్ధి చెందుతోందని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. బిఎ 1, బిఎ 1.1, బిఎ.2, బిఎ.3 వంటి వేరియంట్లను గుర్తించామని తెలిపారు.
WHO : ప్రపంచ దేశాలను గజగజ వణికించిన కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత వారం కోటీ 60 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మరో 75 వేల మందికిపైగా వైరస్‌కు బలయ్యారని స్పష్టం చేసింది. కొత్త కేసుల్లో 19 శాతం తగ్గుదల కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే ఇదే తరుణంలో మరణాల సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. దీంతో కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్నాయి.
కరోనా తగ్గుముఖం పట్టి జనజీవనం మళ్లీ యథాస్థితికి చేరుకుంటున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పిడుగు లాంటి వార్తను వెల్లడించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వైరస్ వృద్ధి చెందుతోందని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ హెచ్చరించారు.
undefined
కరోనా పరిస్థితుల గురించి WHO కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడిన ఓ వీడియోను డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. "వైరస్ అభివృద్ధి చెందుతోంది. ఒమిక్రాన్ అనేక సబ్-వేరియంట్‌లను గుర్తించాం. BA.1, BA.1.1, BA.2 మరియు BA.3 గా రూపాంతరం చెందింది. నిజంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా డెల్టాను ఎలా అధిగమించిందనేది నమ్మశక్యం కావడం లేదు.. చాలా వరకు జన్యు విశ్లేషణల్లో BA.1, BA.2 సీక్వెన్స్‌ల నిష్పత్తిలో పెరుగుదలను కూడా చూస్తున్నాం ’’ అని అని ఆమె అన్నారు.
గత వారం కోవిడ్ -19 వల్ల దాదాపు 75,000 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. సబ్-వేరియంట్ BA.2పై ఆందోళన వ్యక్తం చేసిన WHO అధికారి "BA.2 అనేది ఇతర సబ్ వేరియంట్ల కన్నా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని అన్నారు. BA.2 BA.1 కంటే ప్రాణాంతకం అని ఎటువంటి ఆధారాలు లేవని కెర్ఖోవ్ చెప్పారు. కానీ నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు
డెల్టా కంటే ఓమిక్రాన్ తేలికపాటిది కాదని, డెల్టా కంటే తీవ్రత తక్కువేనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు చివరకు నిర్ధారణకు వచ్చారు. ఒమిక్రాన్ బారినపడి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, గణనీయమైన సంఖ్యలో మరణాలను చూస్తున్నామనీ. ఇది జలుబు కాదు, ఇన్ఫ్లుఎంజా కాదు. కాబట్టి .. ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాలని కెర్ఖోవ్ అన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో నిర్థారణ అవుతున్న ప్రతి ఐదు ఒమిక్రాన్ కేసుల్లో ఒకటి బీఏ.2 కేసు అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత రెండు వారాల్లో.. ఆర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా మరియు ఉక్రెయిన్‌లలో కోవిడ్-19 కేసులు రెండింతలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ రీజినల్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో తెలిపారు. ఇక, రెండు రోజుల కిందట వీక్లీ కోవిడ్ అప్‌డేట్స్‌లో తూర్పు ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలిపారు.