Omicron : ‘ప్రస్తుతం డేంజర్ కాదు.. కానీ నమ్మలేం...’ దక్షణాఫ్రికా సైంటిస్టుల కొత్త హెచ్చరిక...

By AN TeluguFirst Published Dec 2, 2021, 10:15 AM IST
Highlights

ఈ coronavirus strain అసలైన ప్రభావాన్ని ఇప్పుడే గుర్తించడం చాలా కష్టమని, ఎందుకంటే ఇది ఇప్పటివరకు ఎక్కువగా యువతలోనే కనిపించంది. వీరిలో వ్యాధికారక క్రిములతో పోరాడగలిగే శక్తి ఎక్కువగా ఉన్న యువకులనే ప్రభావితం చేయడం వల్ల లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నారు. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. అయితే ఇది మైల్డ్ లక్షణాలే కలిగి ఉంటుందని కాబట్టి భయపడాల్సిన పనిలేదని కాకపోతే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే  దక్షిణాఫ్రికాలోని లీడింగ్ శాస్త్రవేత్తలు మాత్రం ఓమిక్రాన్ వేరియంట్ వల్ల తేలికపాటి అనారోగ్యానికి మాత్రమే కారణమవుతుందని అప్పుడే నిర్ధారించలేం అని హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు పూర్తిగా బయటపడడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. 

ఈ coronavirus strain అసలైన ప్రభావాన్ని ఇప్పుడే గుర్తించడం చాలా కష్టమని, ఎందుకంటే ఇది ఇప్పటివరకు ఎక్కువగా యువతలోనే కనిపించింది. వీరిలో వ్యాధికారక క్రిములతో పోరాడగలిగే శక్తి ఎక్కువగా ఉన్న యువకులనే ప్రభావితం చేయడం వల్ల లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నారు. వైరస్ విస్తరణ కొంతకాలం జరిగితేనే కానీ ప్రజల అనారోగ్యం గురించి తెలియదని బుధవారం చట్టసభ సభ్యులకు ఒమిక్రాన్ మీద ఇచ్చిన ప్రజంటేషన్ లో శాస్త్రవేత్తలు తెలిపారు. 

అంతకుముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గత 24 గంటల్లో దక్షిణాఫ్రికాలో కొత్త ధృవీకరించబడిన కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయి 8,561 ఇన్ఫెక్షన్లకు చేరుకుందని తెలిపింది. ఒమిక్రాన్ ఇప్పుడు దేశంలో dominant strainగా ఉంది.

అయితే ఈ తాజా అంటువ్యాధి "ఎక్కువగా యువతలో ఎక్కువగా కనిపిస్తుందని.. అది మెల్లిగా పెద్దవారికి సంక్రమించడం గమనించామని’  NICD ప్రజారోగ్య నిఘా, ప్రతిస్పందన హెడ్ మిచెల్ గ్రూమ్ చట్టసభ సభ్యులతో అన్నారు. అంతేకాదు వైరస్ కు సంబంధించిన "మరింత తీవ్ర సమస్యలు కొన్ని వారాలపాటు బయటపడకపోవచ్చని కూడా మేం ఆశిస్తున్నాం" అన్నారు.

నవంబర్ 25న, దక్షిణాఫ్రికా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు తమ దేశంలో కొత్త వేరియంట్ కనుగొనబడిందని తెలిపారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓమిక్రాన్ అని నామకరణం చేసిందని ప్రకటించారు. దీంతో ఈక్విటీ మార్కెట్ అమ్మకాలను ప్రభావితం చేసింది. ఈ ప్రకటనతో అనేక దేశాలు దక్షిణాఫ్రికాపై travel bans విధించడానికి దారితీసింది.

KRISP జెనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ రిచర్డ్ లెస్సెల్స్ మాట్లాడుతూ, కొత్త జాతి వల్ల ఎలాంటి లక్షణాలు, అనర్థాు కలుగుతాయన్నది మాస్క్ చేయబడిందని అన్నారు. కారణం ఇప్పటికే చాలామంది కరోనా ఇతర వేరియంట్ల బారిన పడి ఉండడం, లేదా టీకాలు వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కలిగి ఉండడం వల్ల దీని తీవ్రత తెలియడం లేదని అన్నారు. 

‘వైరస్ వ్యాప్తి తీవ్రం అయినప్పుడు అసలు ప్రమాదం తెలుస్తుంది. ఈ వైరస్ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తిస్తే.. ఇప్పటికీ టీకాలు వేసుకోని వారు, దీర్ఘ కాల వ్యాధులకు సరైన జాగ్రత్తలు తీసుకోని వారి మీద తీవ్ర ప్రమాదం ఉండొచ్చు’ అని రిచర్డ్ అన్నారు. అయితే మామూలుగా మనం మొత్తం దేశం గురించి మాట్లాడతాం.. కానీ సమస్య వీరికి ఎక్కువ.. ఉండొచ్చు.. అని అన్నారు.  

Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

పాశ్చాత్య దేశాలు, చైనాతో పోల్చితే దక్షిణాఫ్రికాలో టీకా రేటు తక్కువగా ఉంది. కానీ చాలా ఆఫ్రికన్ దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ఇక్కడ జనాభాలో నాలుగింట ఒక వంతు పూర్తిగా టీకాలు వేయబడింది. 1.3 బిలియన్ల జనాభా ఉన్న ఖండం అంతటా, కేవలం 6.7% మాత్రమే పూర్తిగా వాక్సినేషన్ పూర్తయ్యింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని 100 మిలియన్ల మందిలో 0.1% మాత్రమే వారి షాట్‌లను పొందారు.

అయినప్పటికీ, వైవిధ్యం ప్రతిరోధకాలను తప్పించుకోగలిగినప్పటికీ, T-కణాల వంటి శరీరం ఇతర రక్షణలు ఇప్పటికీ ప్రభావవంతంగా ఉండవచ్చని లెస్సెల్స్ ఆశించారు. T- కణాలు సోకిన కణాలను చంపుతాయి.

"వేరే ఇతర తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా మీరు తీసుకుంటున్న రక్షణ ఈ రూపాంతరం మీ దరికి చేరడానికి చాలా కష్టమని మేం ఆశిస్తున్నాము" అని అతను చట్టసభ సభ్యులతో చెప్పాడు. "ఇది మనం ఉపయోగించే చికిత్సా విధానాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందని మేం అనుకోవడం లేదు" అన్నారు. 
 

click me!