చిన్నారులకు మహమ్మద్‌ ప్రవక్త నగ్నచిత్రాలు చూపించిన టీచర్.. సస్పెన్షన్...

By AN TeluguFirst Published Oct 31, 2020, 12:18 PM IST
Highlights

పదేళ్లలోపు చిన్నారులకు మహ్మద్‌ ప్రవక్త నగ్న కార్టూన్‌లను చూపించిన ఓ టీచర్ సస్పెండ్ అయిన ఘటన బెల్జియంలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని మోలెన్‌బీక్‌లోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఓ టీచర్ ఆరో తరగతి విద్యార్థులకు మహ్మద్‌ ప్రవక్త నగ్న కార్టూన్‌ని చూపించాడని తెలిసింది. 

సివిక్‌ స్పిరిట్‌ క్లాస్‌లో భాగంగా ఉపాధ్యాయుడు ఐదవ తరగతి విద్యార్థులకు కార్టూనిస్ట్‌ కోకో గీసిన మోకాళ్లపై నగ్నంగా ఉన్న మహమ్మద్‌ ప్రవక్త కార్టూన్‌ని చూపించాడు. ఇంటికి వచ్చిన పిల్లలు తరగతి గదిలో జరిగిన సంఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. 

వారి ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోలెన్‌బీక్‌ మేయర్‌ కేథరీన్‌ మౌరెక్స్‌ తెలిపారు. ‘చిన్నారులకు అశ్లీల ఫోటోలను చూపిండం నేరం. పైగా సదరు ఉపాధ్యాయుడు మహమ్మద్‌ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చూపించాడు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అందుకే అతడి మీద చర్యలు తీసుకున్నాం’ అని కేథరీన్‌ తెలిపారు. 

ఉపాధ్యాయుని సస్పెన్షన్‌పై ఫ్రాంకోఫోన్ లిబరల్ పార్టీ ఎంఆర్‌ అధ్యక్షుడు జార్జెస్-లూయిస్ బౌచెజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో "ఈ సమాచారం ఖచ్చితమైనది కాదని నేను నమ్ముతున్నాను, అది నిజమైతే, అది ఆమోదయోగ్యం కాదు, దారుణం, భావ ప్రకటనా స్వేచ్ఛను ఇలా అనుకోవడం సరికాదు" అంటూ ట్వీట్‌ చేశారు. మౌరిక్స్ ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ..‘ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు అశ్లీల చిత్రాలు చూపించరాదని, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి ఇదే కారణమని’ హామీ ఇచ్చారు.

click me!
Last Updated Oct 31, 2020, 12:17 PM IST
click me!