Nupur Sharma case: "అవి సంకుచిత వ్యాఖ్య‌లు".. ముస్లిం దేశాల తీరును ఖండించిన భార‌త్

Published : Jun 06, 2022, 02:42 PM IST
Nupur Sharma case: "అవి సంకుచిత వ్యాఖ్య‌లు"..  ముస్లిం దేశాల తీరును ఖండించిన భార‌త్

సారాంశం

Nupur Sharma case: మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన ప్రకటన ప్ర‌పంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యపై పలు అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత రాయబారులను పిలిపించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ క్ర‌మంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) చేసిన వ్యాఖ్యలు భార‌త్ తీవ్రంగా  ఖండించింది.    

Nupur Sharma case: మహ్మద్‌ ప్రవక్తపై బిజెపి నేతలు చేసిన‌ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దూరం రేపుతున్నాయి. ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన‌ వ్యాఖ్యల‌పై పలు అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన పలు దేశాలు.. బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలిపాయి. సౌదీ సహా పలు అరబ్‌ దేశాలు చేస్తోన్న వ్యాఖ్యలను భారత్‌ తోసిపుచ్చింది. 
 
సౌదీలోని జెడ్డా నగరానికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC).. ప్రవక్తపై బిజెపి నేత నుపూర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు ఖండించింది.  భారత్‌లో ఇస్లాం పట్ల ద్వేషాన్ని తీవ్రతరం చేసేందుకు .. ముస్లింలకు వ్యతిరేకంగా ఓ క్రమబద్ధమైన పద్ధతులను అనుసరిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ ప్రకటన అసంబద్ధమని పేర్కొంటూ, భారత్ తన స్వదేశంలో మైనారిటీల భద్రతపై శ్రద్ధ వహించాలని సూచించింది. అయితే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.  

OIC సెక్రటేరియట్ ప్రకటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్బి స్పందిస్తూ.. OIC సెక్రటేరియట్‌ సంకుచిత వ్యాఖ్యలను భారత్‌ తిరస్కరిస్తుందని అన్నారు.  భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందనీ. కొందరు వ్యక్తులు మతపరమైన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అభ్యంతరకర ట్వీట్లు, ప్రకటనలు చేశారు. ఈ వివాదాస్పద ప్రకటనలు భారత ప్రభుత్వ అభిప్రాయానికి సంబంధించినవి కావనీ. ఆ వ్యాఖ్య‌లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంద‌ని పేర్కొన్నారు. 

కాగా, ఒఐసి అనేది ముస్లిం దేశాలకు అంతర ప్రభుత్వ సంస్థ. దీని సభ్య దేశాల్లో పాకిస్తాన్‌ కూడా ఉంది. తరచూ దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించినందుకు ఐఒసిని భారత్‌ ఖండిస్తూనే ఉంది. కొన్ని సంస్థ‌లు తప్పుదోవ పట్టించే, దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బాగ్చి అన్నారు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం సాగుతున్న విభజన ఎజెండా మాత్రమేన‌నీ, OIC సెక్రటేరియట్ దాని మతపరమైన దృక్పథాన్ని విడిచిపెట్టి, అన్ని మతాలను గౌరవించాలని పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయ ఇన్‌చార్జికి పాకిస్థాన్ పిలుపు

నూపుర్ శర్మ స్టేట్‌మెంట్ కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఇన్‌చార్జికి పాకిస్థాన్ సోమవారం సమన్లు ​​పంపింది. వివాదాస్పద ప్రకటనను పాకిస్థాన్ సహించబోదని ఇంచార్జికి చెప్పింది. ఆమె వ్యాఖ్య‌లు తీవ్రంగా ఖండించింది. వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందనీ, అంతకుముందు.., పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదివారం నూపుర్ శర్మ ప్రకటనను ఖండించారు.  ద్వేషపూరిత వ్యాఖ్య‌ల‌ని పేర్కొన్నారు.

సౌదీ అరేబియా ప్రకటన  

నుపుర్ శర్మ ప్రకటనపై ఖతార్, కువైట్, ఇరాన్ ఇప్పటికే అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయగా, సోమవారం సౌదీ అరేబియా కూడా అందులో చేరింది. అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే నూపుర్ శర్మపై తీసుకున్న చర్యను సౌదీ అరేబియా స్వాగతించింది.

పాకిస్థాన్ మాటలు అసంబద్ధం: భారత్

పాకిస్థాన్ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందిస్తూ.. పాకిస్థాన్ ప్రకటనలు, వ్యాఖ్యలు చూశామని తెలిపింది. వరుసగా మైనారిటీల హక్కులకు భంగం కలిగించే వారి అసంబద్ధమైన మాటలు ఎవరికీ పట్టవు. మరే దేశంలోనూ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వ్యాఖ్యానించే హక్కు దానికి లేదు. పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, మ‌హ్మదీలు; ఇతర మైనారిటీలను సంస్థాగతంగా హింసించడాన్ని ప్రపంచం చూసింది. భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. అందుకు విరుద్ధంగా పాకిస్థాన్ ఛాందసవాద ప్ర‌క‌ట‌న చేస్తుంది. భారత్‌లో మత సామరస్యాన్ని సృష్టించేందుకు, ప్రమాదకరమైన ప్రచారం చేయకుండా, తమ దేశంలోని మైనారిటీల భద్రత, సంక్షేమంపై దృష్టి సారించింద‌నీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 
నూపుర్ శర్మ ప్రకటనపై OIC సెక్రటేరియట్ తీవ్రంగా స్పందించింది. భారత అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేసిన వివాదాస్పద ప్రకటనపై OIC సెక్రటరీ జనరల్ తీవ్రంగా విమర్శించింది. భారతదేశంలో ముస్లింలపై హింస పెరిగింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం, ముస్లింల ఆస్తుల ధ్వంసం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. ముస్లింలపై ఆంక్షలు విధిస్తున్నారని OIC పేర్కొంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే