పాశ్చాత్య దేశాలకు పుతిన్ మరో వార్నింగ్.. ఉక్రెయిన్‌కు ఆ ఆయుధాలు అందిస్తే ఊరుకోం

Published : Jun 05, 2022, 06:00 PM IST
పాశ్చాత్య దేశాలకు పుతిన్ మరో వార్నింగ్.. ఉక్రెయిన్‌కు ఆ ఆయుధాలు అందిస్తే ఊరుకోం

సారాంశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలు సరఫరా చేయడం అంటే.. యుద్ధాన్ని పొడిగించడమేనని వివరించాడు. ఒక వేళ లాంగ్ రేంజ్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తే.. తాము ఇది వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలనూ కూడా టార్గెట్ చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు.

న్యూఢిల్లీ: పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో వార్నింగ్ ఇచ్చాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించొద్దని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించి ఈ యుద్ధాన్ని మరింత పొడిగిస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఒక వేళ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉక్రెయిన్‌కు అందిస్తే మాత్రం తాము ఊరుకోబోమని పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. తాము అప్పటి పరిస్థితులను అంచనా వేసి అందుకు తగినట్టుగానే రష్యా కూడా దాడులు చేస్తుందని అన్నాడు. ఇది వరకు పేల్చని చోట్ల కూడా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించాడు.

కీవ్‌కు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సరఫరా చేస్తే తాము అందుకు తగిన అంచనాలను ఏర్పరుచుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపాడు. ఇది వరకు తాము లక్ష్యం చేసుకోని టార్గెట్లనూ కూడా అప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని స్పష్టం చేశాడు. అయితే, ఏ రేంజ్ మిస్సైల్స్‌ను వినియోగిస్తారనేది? వేటిని టార్గెట్లు గా చేసుకుంటారనేది మాత్రం పుతిన్ చెప్పలేదు.

వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా దేశాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ వార్నింగ్ చేయలేదు. కానీ, ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలను కొనసాగిస్తామని అమెరికా మరోసారి ప్రకటించిన తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హిమర్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు తరలిస్తామని అమెరికా తెలిపింది. హిమార్స్ ప్రయాణిస్తూనే మిస్సైల్స్ ప్రయోగించే సామర్థ్యం కలది. ఈ సిస్టమ్ ద్వారా 80 కిలోమీటర్ల దూరంలోని వస్తువు నూ టార్గెట్ చేసుకోవచ్చు.

అయితే, ఈ హిమర్ సామర్థ్యం రష్యా దగ్గర ఉన్న వ్యవస్థల కంటే కూడా కొంత ఎక్కువ రేంజ్ కలిగినవని నిపుణులు చెబుతున్నారు. అంటే... రష్యాకు అందని దూరంలో ఉండి ఆ దేశంపై అమెరికా పంపించే హిమర్ సిస్టమ్‌లతో దాడి చేయవచ్చు.

తమకు తెలిసి ఇప్పటి వరకు ఉక్రెయిన్ 45 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులను ఉక్రెయిన్  వినియోగిస్తున్నారని పుతిన్ అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం అంటే.. ఈ మిలిటరీ ఆపరేషన్‌ను మరింత పొడిగించడమేనని తెలిపాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే