
నైరుతి నైజీరియాలో మారణహోమం జరిగింది. ఓ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ముష్కరులు కాల్పులు జరిపారు. బాంబులు పేల్చారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది చనిపోయారని ప్రాథమిక అంచనా. పెంతెకోస్ట్ ఆదివారం రోజున ప్రార్థనా మందిరాలు గుమిగూడినట్లే ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు శాసన సభ్యుడు ఒగున్మొలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు..
ప్రిసైడింగ్ ప్రీస్ట్ ను కూడా అపహరించినట్లు నైజీరియా దిగువ శాసన సభలోని ఓవో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడెలెగ్బే టిమిలేయిన్ తెలిపారు. మా హృదయాలు బరువెక్కాయి అని ఒండో గవర్నర్ రోటిమి అకెరెడోలు ఆదివారం ట్వీట్ చేశారు. మన శాంతి, ప్రశాంతతలపై ప్రజల శత్రువులు దాడి చేశారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో అధికారులు వెంటనే అధికారిక మరణాల సంఖ్యను విడుదల చేయలేదు. కనీసం 50 మంది మరణించారని టిమిలీన్ చెప్పారు. మరి కొంత మంది మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.
దాడి జరిగిన ప్రదేశంలో నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో చర్చి ఆరాధకులు రక్తపు మడుగులలో పడి ఉండగా వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ఏడుస్తూ కనిపిస్తున్నారు. ఈ ఘటన విషయంలో నైజీరియన్ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మాట్లాడుతూ..ఈ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఇలాంటి దుర్మార్గపు చర్యకు ప్లాన్ వేసి అమలు చేసి ఉండవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏది ఏమైనప్పటికీ ఈ దేశం దుష్టులకు ఎప్పటికీ లొంగదని పేర్కొన్నారు. చీకటి ఎప్పటికీ వెలుగును జయించదని చెప్పారు. నైజీరియా దీర్ఘకాలిక భద్రతా సంక్షోభానికి ముగింపు పలకాలని ప్రతిజ్ఞ చేశారు. చివరికి నైజీరియా గెలుస్తుందని చెప్పారు. కాగా చర్చిపై దాడి వెనుక ఎవరున్నారో వెంటనే స్పష్టత రాలేదు. నైజీరియాలో ఎక్కువ భాగం భద్రతా సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ, ఒండో నైజీరియా అత్యంత శాంతియుత దేశాలలో ఒకటిగా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. అయితే రైతులు, పశువుల కాపరుల మధ్య పెరుగుతున్న హింసాత్మక సంఘర్షణలో రాష్ట్రం చిక్కుకుంది.
పాశ్చాత్య దేశాలకు పుతిన్ మరో వార్నింగ్.. ఉక్రెయిన్‌కు ఆ ఆయుధాలు అందిస్తే ఊరుకోం
దాడి ఎలా జరిగిందని, అనుమానితుల విషయంలో ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నలకు నైజీరియా భద్రతా బలగాలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. లాగోస్ కు తూర్పున ఓవో సుమారు 345 కిలోమీటర్ల (215 మైళ్ళు) దూరంలో ఉంది. ఓవో చరిత్రలో ఇలాంటి వికారమైన ఘటనను ఎన్నడూ చవిచూడలేదని శాసనసభ్యుడు ఒలువోలే అన్నారు.