
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది. అయితే, ఆ ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు వెబ్ క్యామ్ ఆన్ చేసి ఉంచాలని ఆదేశించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఉద్యోగి ఆ వెబ్ క్యామ్ ఆన్ చేసి పెట్టలేదు. దీంతో ఆ కంపెనీ వేరే ఇతర కారణాలను చెబుతూ ఉద్యోగం నుంచి తొలగించింది. దీని పై సదరు ఉద్యోగి కోర్టుకు ఎక్కాడు. ఆ ఉద్యోగి తన గోప్యత హక్కును కాపాడుకున్నాడని, కాబట్టి, అమెరికా కంపెనీనే ఆయనకు పరిహారంగా సుమారు రూ. 60 లక్షలు జరిమానా విధించాలని ఆదేశించింది.
ఫ్లోరిడాకు చెందిన టెలీమార్కెటింగ్ కంపెనీ చెటు తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోంకు పంపింది. డ్యూటీలో ఉన్న 9 గంటల పాటు క్యామెరా ఆన్ చేసి పెట్టాలని ఆదేశించింది.ఓ ఉద్యోగి అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే ఆ కంపెనీ ఉపయోగిస్తున్న ప్రోగ్రామ్ ద్వారా యూజర్ తన ల్యాప్‌టాప్ స్క్రీన్ షేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తన లైవ్ వీడియోకూ అనుమతించాల్సి ఉంటుంది.
Also Read: వర్క్ ప్రం హోంకు మంగళం పాడిన టీసీఎస్, ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు ఆదేశం.
దీనికి సదరు ఉద్యోగి అంగీకరించలేదు. ఫలితంగా కంపెనీ ఆ ఉద్యోగిని ఫైర్ చేసింది. తన డ్యూటీ టైంలో మొత్తం తనను వెబ్ క్యామ్ ద్వారా చూస్తూ ఉండటం, ల్యాప్ టాప్ స్క్రీన్ షేర్ చేసి నిరంతరం తనను ట్రాక్ చేయడం తన గోప్యతను ఉల్లంఘించినట్టుగా ఆ ఉద్యోగి భావించాడు. కాబట్టి, ఆ వెబ్ క్యామ్ ఆన్ చేయడానికి తిరస్కరించాడు. కాబట్టి, ఆ కంపెనీ ఇతర అభియోగాలతో ఉద్యోగిని తొలగించింది.
సదరు ఉద్యోగి కంపెనీ ఆదేశాలు శిరసా వహించడం లేదని, పని చేయడానికి విముఖంగా ఉన్నాడనే అభియోగా లతో ఫైర్ చేసింది. అనంతరం, నెదర్లాండ్ కు చెందిన కోర్టు చెటు కంపెనీకి ఫైన్ విధించింది. ఆ కంపెనీకి పెద్ద మొత్తంలో ఫైన్ వేసింది. సుమారు రూ. 60 లక్షలు జరిమానా విధించింది.