కరోనా వైరస్ కట్టడిలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. కరోనా పై సలిపిన పోరులో చైనా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కిమ్ కొనియాడారు. దాదాపు 20 రోజుల అజ్ఞాతవాసం తరువాత కిమ్ బయటకొచ్చిన వెంటనే ఇలా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి ఈ సందేశాన్ని పంపించారు.
కరోనా వైరస్ కట్టడిలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. కరోనా పై సలిపిన పోరులో చైనా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కిమ్ కొనియాడారు. దాదాపు 20 రోజుల అజ్ఞాతవాసం తరువాత కిమ్ బయటకొచ్చిన వెంటనే ఇలా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి ఈ సందేశాన్ని పంపించారు.
ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఇలా చైనా విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలపడంతోపాటు.... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరోగ్యాంగా ఉండాలని కూడా కిమ్ ఆకాంక్షిస్తున్నట్టు ఉత్తరకొరియా మీడియా తెలిపింది.
undefined
ఇకపోతే... ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం సరిగా లేదని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు తాజాగా చెక్ పడిన విషయం తెలిసిందే! చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆయన రాకతో... ఆయన ఆరోగ్యం సరిగాలేదంటూ వార్తలు రాసిన జాతీయ మీడియా సంస్థలన్నింటికీ షాకిచ్చినట్లయ్యింది.
కొరియా లో జరిగిన ఓ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కు ఆయన హాజరైనట్టు తెలుస్తోంది. కార్యక్రమానికి ఆయన తో పటు అతడి సోదరి కూడా హాజరైనట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఒకసారైతే ఏకంగా కిమ్ చనిపోయాడంటూ కూడా వార్త ట్రెండ్ అయ్యింది. దీనికి కారణం గుండె ఆపరేషన్ తరవాత కిమ్ మీడియా ముందుకు రాకపోవడమే. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆయన మళ్లీ కనపడలేదు. దీంతో.. ఆరోగ్యం విషమించిందని.. అందుకే కనపడలేదని వార్తలు పుట్టుకువచ్చాయి.
అయితే కిమ్ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కి వచ్చిన వార్త ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) మాత్రమే వెల్లడించింది. ఆ వీడియోలో కిమ్ రాక చూసి ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు. తమ దేశ అధ్యక్షున్ని చూసి ఆ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ వార్తను కేవలం కేవలం ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తప్ప.. మరే ఇతర న్యూస్ ఏజెన్సీ టెలికాస్ట్ చేయకపోవడం గమనార్హం. జాతీయ మీడియా సంస్థలు కూడా స్పందించలేదు. దీంతో.. ఈ నిజంగా కిమ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా.. కిమ్ గత నెల 11 నుంచి ప్రజలకు కనిపించకుండా పోయారు. గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అంతేకాదు, ఆయనకు చికిత్స చేసేందుకు చైనా నుంచి ఓ వైద్య బృందం కూడా వెళ్లింది. కిమ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలను అమెరికా, దక్షిణ కొరియాలు ఇది వరకే ఖండించాయి