కరోనా కట్టడి: కిమ్ మరో సంచలన నిర్ణయం..కనిపిస్తే కాల్చివేతే

By Siva KodatiFirst Published Sep 11, 2020, 9:52 PM IST
Highlights

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం కోవిడ్‌ను తనదైన శైలిలో డీల్ చేస్తున్నారు. చైనా నుంచి దేశంలోకి వస్తున్న కరోనా రోగులను కాల్చి పారేయాల్సిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం  ఆదేశించినట్లుగా యూఎస్ ఫోర్సెస్ కమాండర్ తెలిపారు

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కిందా మీదా పడుతున్నాయి. మాస్కులు పెట్టుకోండి.. శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం కోవిడ్‌ను తనదైన శైలిలో డీల్ చేస్తున్నారు. చైనా నుంచి దేశంలోకి వస్తున్న కరోనా రోగులను కాల్చి పారేయాల్సిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం  ఆదేశించినట్లుగా యూఎస్ ఫోర్సెస్ కమాండర్ తెలిపారు.

కోవిడ్ పుట్టిన చైనాకు పక్కనే ఉన్నప్పటికీ.. నార్త్ కొరియాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించలేదు. కాగా జనవరిలోనే చైనాతో ఉన్న సరిహద్దును ఉత్తరకొరియా మూసివేసింది.

దీని కారణంగా స్మగ్లింగ్‌కు డిమాండ్ బాగా పెరిగిందని యూఎస్ కమాండ్ తెలిపారు. చైనాతో సరిహద్దుల్లో ఒక కిలోమీటరు పరిధిలో నార్త్ కొరియా బఫర్ జోన్ ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు.

షూట్-టు-కిల్ అధికారాలను ప్రత్యేక కార్యకలాపాల దళాలకు కిమ్ సర్కార్ అప్పగించడం వల్ల చైనా- ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న వ్యక్తులను ఎలాంటి కారణాల అడక్కుండానే కాల్చి చంపేసే అధికారం వారికి ఉంటుంది.

స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు, స్ట్రైక్ ఫోర్స్‌ను చైనా సరిహద్దుల్లో మోహరించిన ఉత్తర కొరియా.. చైనా నుంచి అక్రమంగా వస్తున్న వారిని కాల్చి చంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 

click me!