ఫలితాలకు ముందే మృతి: అమెరికా ఎన్నికల్లో విజయం

By narsimha lodeFirst Published Nov 4, 2020, 4:30 PM IST
Highlights

చనిపోయిన వ్యక్తి అమెరికా ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించినా ఆ ఫలితం గురించి ఆయనకు తెలియదు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు.
 


వాషింగ్టన్: చనిపోయిన వ్యక్తి అమెరికా ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించినా ఆ ఫలితం గురించి ఆయనకు తెలియదు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు.

అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన 55 ఏళ్ల రిపబ్లికన్ నేత డేవిడ్ అందల్ కరోనాతో ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన మరణించారు. కరోనా కారణంగా ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ గత నెలలో మరణించాడు. నార్త్ డకోటాలోని డిస్టిక్ 8 నుండి పోటీ చేసి విజయం సాధించాడు.

ప్రపంచంలోనే కరోనాతో మరణిస్తున్న రోగుల సంఖ్య నార్త్ డకౌటాలోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

also read:మనమే గెలిచాం, సుప్రీంకోర్టుకు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పోలింగ్ పూర్తైన నెల రోజుల తర్వాత ఇవాళ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నార్త్ డకోటాలోని బిస్ మర్క్ ప్రాంతంలో రిపబ్లిక్ పార్టీ తరపున డేవిడ్ అందల్, డేవ్ నెహరింగ్ లు పోటీ పడ్డారు.  అందల్ కు 35 శాతం ఓట్లు దక్కాయి. రైతులు, బొగ్గు పరిశ్రమకు ఎంతో సేవ చేయాలని డేవిడ్ తపించినట్టుగా ఆయన తల్లి పేర్కొన్నారు. 

కరోనా విషయంలో తన కొడుకు చాలా జాగ్రత్తగా ఉన్నాడని.... అయినా కరోనా బారినపడ్డారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలని తన కొడుకు చాలా ఆశపడ్డాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.దేశాభివృద్ధి కోసం తన కొడుకుకు చాలా అంశాలను అమలు చేయాలని భావించాడని ఆమె చెప్పారు. 

click me!