Nobel Prize Auction: నోబెల్ బహుమ‌తిని రూ.800 కోట్లకు వేలం పెట్టిన ర‌ష్యాన్ జ‌ర్న‌లిస్ట్.. ఎందుకో తెలుసా..?

By Rajesh KFirst Published Jun 22, 2022, 6:30 AM IST
Highlights

Nobel Prize Auction: ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనాధులుగా మారిన  పిల్లలను ఆదుకునేందుకు రష్యన్‌ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్‌ ముందుకొచ్చారు. గత ఏడాది తాను పొందిన నోబెల్‌ శాంతి బహుమతి మెడల్‌ను వేలానికి పెట్టగా.. 10.35 కోట్ల డాలర్లు(దాదాపు రూ.808 కోట్లు) పలికింది. ఈ మొత్తాన్ని నేరుగా UNICEFకి బదిలీ చేయ‌నున్నారు.   
 

Nobel Prize Auction: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో భారీ విధ్వంసం మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్లారు. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం వల్ల పిల్లలు కూడా బాగా ప్రభావితమయ్యారు. కాగా, ఉక్రెయిన్‌లో పిల్లలకు సహాయం చేసినందుకు రష్యా జర్నలిస్టు తన నోబెల్ బహుమతిని వేలం వేశారు. రష్యా జర్నలిస్టు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని సోమవారం రాత్రి వేలం వేశారు.

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలకు సహాయం చేయడానికి రష్యన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ నోబెల్ బహుమతి వేలం నుండి డబ్బును విరాళంగా ఇవ్వనున్నారు. అతను ఈ మొత్తాన్ని నేరుగా UNICEFకి బదిలీ చేయ‌నున్నారు. తద్వారా పిల్లలకు సహాయం చేయవచ్చు.

రష్యా జర్నలిస్టు నోబెల్ మెడల్ ఎందుకు వేలం వేశారు?

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కార‌ణంగా.. నిరాశ్రయులైన పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్ట్, స్వతంత్ర వార్తాపత్రిక నోవాయా గెజెటా ఎడిటర్-ఇన్-చీఫ్, డిమిత్రి మురాటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది తాను పొందిన నోబెల్‌ శాంతి బహుమతి మెడల్‌ను సోమవారం రాత్రి వేలానికి  పెట్ట‌గా.. నోబెల్ శాంతి పతకాన్ని10.35 కోట్ల డాలర్లు(దాదాపు రూ.808 కోట్లు) పలికింది. గత రికార్డును బద్దలుకొట్టింది. 1962లో నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్త జేమ్స్‌ వాట్సన్‌ 2014లో తన మెడల్‌ను వేలానికి పెట్టగా, అప్పట్లో 47.6 లక్షల డాలర్లు వచ్చాయి.
 
ఉక్రెయిన్‌లో యుద్ధంలో అనాథలుగా మారిన పిల్లల గురించి  ఆందోళన చెందుతున్నానని చెప్పాడు. ఆ పిల్ల‌లు వారి భవిష్యత్తును తిరిగి పొందాలనుకుంటున్నామని డిమిత్రి మురాటోవ్  చెప్పాడు. ప్రముఖ రష్యన్‌ దినపత్రిక నోవయ గజెటాకు డిమిత్రి మురటోవ్‌ సంపాదకుడు. జర్నలిజంలో ఆయన చేసిన విశేష కృషి గాను 2021 లో నోబెల్ శాంతి బహుమతి వ‌చ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఆయన చేసిన కృషికి కమిటీ ఆయనను సత్కరించింది. 

సోవియట్ యూనియన్ పతనం తర్వాత 1993లో నోవాయా గెజిటాను స్థాపించిన జర్నలిస్టుల బృందంలో ఆయన ఒకరు. మురటోవ్‌ మొదటి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రష్యా ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో అనుకూల పత్రికలు నడుస్తుండగా… మురటోవ్‌ ఎడిటర్‌గా ఉన్న నోవయ గజెటా పత్రిక మూతపడింది.

click me!