ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ ప్రైజ్

By narsimha lodeFirst Published Oct 9, 2020, 3:15 PM IST
Highlights

ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎప్‌పీ) నోబెల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించారు.ప్రపంచ శాంతి బహుమతి కోసం 318 నామినేషన్లు అందాయి. 211 మంది వ్యక్తులు, 107 సంస్థలకు నోబెల్ శాంతి పురస్కరాల కోసం ధరఖాస్తులు అందాయి.
 

స్టాక్ హోం: ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎప్‌పీ) నోబెల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించారు.ప్రపంచ శాంతి బహుమతి కోసం 318 నామినేషన్లు అందాయి. 211 మంది వ్యక్తులు, 107 సంస్థలకు నోబెల్ శాంతి పురస్కరాల కోసం ధరఖాస్తులు అందాయి.

సంక్షోభిత ప్రాంతాల్లో  సేవలకు చేసినందుకు గాను డబ్ల్యూఎఫ్‌పీని ఎంపిక చేసింది. నోబెల్ కమిటీ ఆకలి ముప్పుతో బాధపడుతున్న లక్షలాది మంది ప్రజల వైపు ప్రపంచం దృష్టి పెట్టాలని కోరుకొంటుంది.

కరోనా కారణంగా ప్రపంచంలో వేలాది మంది ఆకలితో బాధపడడానికి దోహదపడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం తన ప్రయత్నాలను ఈ సమయంలో తీవ్రతరం చేసే అద్భుతమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించింది.

1901 నుండి 2019 వరకు 100 నోబెల్ శాంతి పురస్కరాలు ప్రదానం చేశారు.ఇందులో 24 సంస్థలకు శాంతి పురస్కారాలు దక్కాయి. రెండు శాంతి బహుమతులు ముగ్గురికి పంచారు.

ఇప్పటివరకు 17 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.  డక్ థో నోబెల్ శాంతి బహుమతి దక్కినా... కూడ ఆయన ఈ బహుమతిని తిరస్కరించారు.

click me!