ఫస్ట్ టైమ్.. బేబీ కోసం అండం, వీర్యం అవసరం లేదా? .. సింథటిక్ మానవ పిండాల ఉత్పత్తి..

Published : Jun 15, 2023, 10:44 AM ISTUpdated : Jun 15, 2023, 10:49 AM IST
ఫస్ట్ టైమ్.. బేబీ కోసం అండం, వీర్యం అవసరం లేదా? .. సింథటిక్ మానవ పిండాల ఉత్పత్తి..

సారాంశం

ప్రస్తుత కాలంలో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆసక్తికరమైన పరిశోధనలు, అధ్యయనాలతో శాస్త్రీయంగా మానవాళి ఎంతో ఎత్తు ఎదుగుతోంది.

ప్రస్తుత కాలంలో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆసక్తికరమైన పరిశోధనలు, అధ్యయనాలతో శాస్త్రీయంగా మానవాళి ఎంతో ఎత్తు ఎదుగుతోంది. తాజాగా  శాస్త్రవేత్తలు.. అండాలు, స్పెర్మ్(వీర్యం) అవసరం లేకుండానే సింథటిక్ మానవ పిండాలను ఉత్పత్తి చేశారు.  కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు స్టెమ్ సెల్స్(మూలకణాల) నుంచి ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మానవ పిండం లాంటి నిర్మాణాలను సృష్టించినట్లు చెప్పారు.

శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ పిండం వంటి నిర్మాణాలు మానవ అభివృద్ధి ప్రారంభ దశల్లో పెరిగే వాటిని పోలి ఉంటాయి. జన్యుపరమైన అసాధారణతల ప్రభావాలు, పునరావృత గర్భస్రావం జీవరసాయన కారణాలపై క్లిష్టమైన అంతర్దృష్టిని అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిర్మాణాలలో కొట్టుకునే గుండె, అభివృద్ధి చెందుతున్న మెదడు లేనప్పటికీ.. అవి సాధారణంగా మావి, పచ్చసొన, పిండంలో అభివృద్ధి చెందే కణాలను కలిగి ఉంటాయి. మానవుల క్లోనింగ్ సాధ్యమేనా? అంటే.. కోతులు 'జాంగ్ ఝాంగ్ అండ్ హువా హువా' క్లోన్ చేయబడిన మొదటి నాన్-హ్యూమన్ ప్రైమేట్స్(లెమర్‌లు, లోరైస్‌లు, టార్సియర్‌లు, కోతులు, మానవులను కలిగి ఉన్న సమూహంలోని ఏదైనా క్షీరదం).

అయితే ఈ పరిశోధనలు క్లిష్టమైన చట్టపరమైన, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అమెరికాతో సహా అనేక దేశాలు సింథటిక్ పిండాల సృష్టి లేదా చికిత్సను నియంత్రించే చట్టాలను కలిగి లేవు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !