ఏడాది క్రితం నాటి నూడిల్స్ తిని.. 9మంది మృతి

By telugu news teamFirst Published Oct 22, 2020, 3:41 PM IST
Highlights

సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు.

నిన్న వండిన వంటే.. ఈ రోజు కి బాగుండదు. ఫ్రిడ్జ్ లో పెడితే.. మహా అయితే ఇంకో రెండు రోజులు ఉంటుంది. అలాంటిది.. ఏకంగా సంవత్సరం క్రితం వండిన ఆహారం ఇప్పటిదాకా ఎలా బాగుంటుంది. కుళ్లిపోయి.. పాడైపోయి ఉంటుంది. దానిని గమనించిన ఓ కుటుంబం.. సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోకి బీజింగ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది. దీంతో ఈ నూడుల్స్ తిన్న 9 మంది (అందరూ పెద్దవారే) చనిపోయారు. కాగా, ముగ్గురు చిన్నారులు నూడుల్స్ రుచి వారికి నచ్చకపోవడంతో వారు తినలేదు. నూడుల్స్ తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

click me!