పాకిస్తాన్‌లో పేలుడు: ముగ్గురి మృతి, ఏం జరుగుతోంది?

By narsimha lodeFirst Published Oct 21, 2020, 1:12 PM IST
Highlights

పాకిస్తాన్ లోని కరాచీలో బుధవారం నాడు నాలుగంతస్తుల భవనంలో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ ప్రకటించింది.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని కరాచీలో బుధవారం నాడు నాలుగంతస్తుల భవనంలో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ ప్రకటించింది.

పేలుడుకు కారణాన్ని పోలీసులు ఇంకా స్పష్టమైన కారణాన్ని ప్రకటించలేదు. సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.ఈ భవనంలోని రెండో అంతస్తులో పేలుడు వాటిల్లింది. మంగళవారం నాడు  జిన్నా కాలనీలో షెరిన్ బస్ టెర్మినల్ వద్ద బాంబు పేలుడుతో ఐదుగురు గాయపడ్డారు.

పాకిస్తాన్ ఆర్ధిక రాజధానిలో జరిగిన ఘర్షణల్లో 10 మంది కరాచీ పోలీసులు మరణించారని ది ఇంటర్నేషనల్ హెరాల్డ్  ప్రకటించింది.పోలీసులు, సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణల తర్వాత అంతర్యుద్దం జరిగిందని కూడ తెలిపింది.

ఈ విషయమై పాకిస్తాన్ సైన్యం స్పందించింది. సైన్యానికి చెందిన మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా కరాచీ కార్ప్ కమాండర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆ ప్రకటన తెలిపింది. ఈ పరిస్థితులపై వెంటనే విచారించాలని, వాస్తవాలను నిర్ధారించేందుకు నివేదికలను ఇవ్వాలని కోరినట్టుగా ఆ ప్రకటన వివరించింది.

పిఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ సఫ్దార్, మరియం కొద్దిరోజులు కరాచీలో ఉన్నారు.  పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో సఫ్దార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ అలీ జిన్నా సమాధిని అగౌరవపర్చారనే ఆరోపణలతో కరాచీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు.ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు.


 

click me!