పైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి.. న్యూజిలాండ్ లో తొలి టీకా మరణం...

By AN TeluguFirst Published Aug 30, 2021, 11:02 AM IST
Highlights

ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సిన్ అరుదైన సైడ్ ఎఫెక్ట్‌ అని నిపుణులు అంటున్నారు. మయోకార్డిటిస్ కారణంగా ఆ మహిళ మరణించిందని బోర్డు అభిప్రాయపడుతోందని ప్రకటనలో పేర్కొంది. మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల వాపు, ఇది రక్తాన్ని పంప్ చేసే అవయవ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందన లయలలో మార్పులకు కారణమవుతుంది.

వెల్లింగ్టన్ : ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ తో తొలి మరణం నమోదయ్యిందని న్యూజిలాండ్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. పైజర్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఓ మహిళ మృత్యువాత పడింది. ఈ మేరకు ఇండిపెండెంట్  COVID-19 వ్యాక్సిన్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్షించిన తర్వాత.. ఈ సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో మహిళ వయస్సు తెలుపలేదు. 

ఇది ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సిన్ అరుదైన సైడ్ ఎఫెక్ట్‌ అని నిపుణులు అంటున్నారు. మయోకార్డిటిస్ కారణంగా ఆ మహిళ మరణించిందని బోర్డు అభిప్రాయపడుతోందని ప్రకటనలో పేర్కొంది. మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల వాపు, ఇది రక్తాన్ని పంప్ చేసే అవయవ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందన లయలలో మార్పులకు కారణమవుతుంది.

"న్యూజిలాండ్‌లో ఫైజర్ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్ తో మృత్యువాత పడడం ఇదే తొలిసారి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని మీద వివరణ కోసం ఫైజర్ కు న్యూజిలాండ్ ప్రభుత్వం చేసిన మెయిల్ కు కంపెనీ బృందం వెంటనే స్పందించలేదు.

ఈ కేసు విచారణలో ఉందని, మరణానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇండిపెండెంట్ బోర్టు మాత్రం ఆ మహిళ మరణానికి కారణమైన మయోకార్డిటిస్.. వ్యాక్సిన్ వల్లేనని భావిస్తోంది. అయితే, టీకా వేసే సమయానికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని బోర్డు గుర్తించింది. 

"ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌తో టీకాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కోవిడ్ -19 సంక్రమణను, మయోకార్డిటిస్‌ లాంటి వ్యాక్సిన్ దుష్ప్రభావాలు..రెండింటిని  అధిగమిస్తూనే ఉంది" అని ఇది తెలిపింది.

ఇప్పటివరకు ఫైజర్/బయోఎంటెక్, జాన్సెన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా అప్రూవ్ చేశారు. కానీ ఫైజర్ వ్యాక్సిన్ ను మాత్రమే పూర్తి ఆమోదం పొంది.. ప్రజలకు ఇస్తున్నారు. 

న్యూజిలాండ్ వైరస్ బారినుంచి విముక్తి అయిన ఆరు నెలల తరువాత తాజాగా COVID-19 డెల్టా వేరియంట్ వ్యాప్తితో అతలాకుతలం అవుతోంది. తాజాగా సోమవారం 53 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 562 కి చేరుకుంది.డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు.

click me!