మాజీ మిలటరీ అధికారి నిర్వాకం:బాత్రూమ్‌లో రహస్య కెమెరా

Published : Apr 19, 2019, 12:13 PM IST
మాజీ మిలటరీ అధికారి నిర్వాకం:బాత్రూమ్‌లో రహస్య కెమెరా

సారాంశం

రాయబార కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చిన కేసులో మాజీ మిలటరీ అధికారి ఆల్‌ఫ్రెడ్ కీటింగ్‌ను గురువారం నాడుకోర్టు దోషిగా తేల్చింది.  

వెల్లింగ్టన్: రాయబార కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చిన కేసులో మాజీ మిలటరీ అధికారి ఆల్‌ఫ్రెడ్ కీటింగ్‌ను గురువారం నాడుకోర్టు దోషిగా తేల్చింది.

 న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్ కీటింగ్‌ వాషింగ్టన్ రాయబార కార్యాలయంలో ఉన్న బాత్రూంలో కీటింగ్ కెమెరాను అమర్చాడు. అయితే కెమెరా ప్యానెల్  ఊడి పడిపోయింది. దీంతోనే బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన విషయం వెలుగు చూసింది.

ఈ కేసు విషయమై 2017 జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయమై తనకు ఏం తెలియదని  మాజీ మిలటరీ అధికారి నమ్మబలికాడు. కెమెరాలోని మీడియా కార్డు ద్వారా కీటింగ్ డీఎన్‌ఏను కనిపెట్టినట్టు అధికారులు తెలిపారు.

కెమెరాను పలుమార్లు కీటింగ్ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసినట్టు గుర్తించారు.మరోపక్క కీటింగ్ గూడఛారిగా ఏమైనా పనిచేస్తున్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. హెన్రీ స్టీల్ అనే న్యాయవాది మాత్రం కేవలం సహోద్యోగులను రహస్యంగా వీడియా తీయడం కోసమే కీటింగ్ కెమెరాను పెట్టాడని, గూడఛారిగా ఏం పనిచేయడంలేదని కోర్టుకు తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 25న  ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడనుంది. కీటింగ్‌కు 18 మాసాల పాటు శిక్షను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !
Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !