బస్సులో ప్రయాణికులను బయటకులాగి.. కాల్చేశారు

Published : Apr 18, 2019, 11:55 AM IST
బస్సులో ప్రయాణికులను బయటకులాగి.. కాల్చేశారు

సారాంశం

బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగి.. అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో చోటుచేసుకుంది.

బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగి.. అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

ఈ దారుణ ఘటనలో 14మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దుండగులు పారామిలటరీ యూనిఫాంలో వచ్చి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

దాడి జరిగిన బలోచిస్థాన్ ప్రాంతం.. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. మృతుల్లో నేవీ అధికారి ఒకరు, కోస్టల్ అధికారి ఒకరు ఉన్నట్లు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే