16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. న్యూజిలాండ్ లో కొత్త చ‌ట్టం ! 

By Rajesh KarampooriFirst Published Nov 22, 2022, 11:26 AM IST
Highlights

ఓటింగ్ వయస్సును 18 నుండి 16కి తగ్గించడాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత 16 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

న్యూజిలాండ్ ఓ కీలక చ‌ట్టాన్ని రూపొందించాలని భావిస్తుంది. కేవలం 16 ఏళ్లు దాటిన వారికి ఓటు హ‌క్కును క‌ల్పించాలని యత్నిస్తుంది. ఓటరు వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ల‌కు తగ్గించడాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా 16 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

18 ఏళ్లు దాటిన వాళ్ల‌కే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డమంటే..యువ‌త యొక్క మావ‌న హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. ప్రధాని  జసిండా ఆర్డెర్న్ వ్యక్తిగతంగా ఈ మార్పుకు మద్దతు ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన జసిందా ఆర్డెర్న్..  ఓటింగ్ వయస్సు తగ్గించడానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నానని తెలిపారు. కానీ, ఈ మేరకు చట్టాన్ని రూపొందించడానికి తన ప్రభుత్వానికి సరైన మెజార్టీ లేదని, ఈ తరహా ఎన్నికల చట్టాన్ని మార్చాలంటే 75 శాతం పార్లమెంటరీ మద్దతు అవసరమని తెలిపారు.

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ దేశాల్లో ఓటు వేస్తారు

వాతావరణ సంక్షోభం వంటి సమస్యలపై యువత ఓటు వేయగలగాలని, లేకపోతే.. వారికి , వారి భవిష్యత్తును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని న్యూజిలాండ్ కోర్టు పేర్కోంది. బ్రెజిల్, ఆస్ట్రియా మరియు క్యూబా వంటి కొన్ని దేశాలు  18 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే హ‌క్కుల్ని క‌ల్పిస్తోంది.

click me!