దెయ్యంతో గార్డ్ ముచ్చట్లు... వీడియో వైరల్...!

Published : Nov 22, 2022, 11:20 AM IST
దెయ్యంతో గార్డ్ ముచ్చట్లు... వీడియో వైరల్...!

సారాంశం

దెయ్యాలు లేవు అనేవారి సంగతి పక్కన పెడితే... దెయ్యాలు నిజంగా ఉన్నాయి అని నమ్మేవారికి మరింత నమ్మకం కలిగేలా.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

దెయ్యాలు నిజంగా ఉన్నాయాంటారా..? ఈ మాట చాలా మంది నోట మీరు వినే ఉంటారు. ఎందుకంటే... దెయ్యాలు అనేవి ఉండవు అని ఎంత గట్టిగా నమ్మేవారు ఉన్నారో... దెయ్యాలు ఉన్నాయి అనేది మాత్రం నిజం అని అంతే గట్టిగా నమ్మేవారు కూడా అంతే ఉన్నారు. దెయ్యాలు లేవు అనేవారి సంగతి పక్కన పెడితే... దెయ్యాలు నిజంగా ఉన్నాయి అని నమ్మేవారికి మరింత నమ్మకం కలిగేలా.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఆ వీడియోలో... చనిపోయిన పేషెంట్ తో ఆ ఆస్పత్రిలో పనిచేసే గార్డ్ మాట్లాడటం విశేషం. ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లను షాకింగ్ కి గురి చేస్తోంది.

బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోచియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రిలో అమర్చిన సీసీటీవీలో ఈ వీడియో రికార్డు అయింది. ఆటోమెటిక్ గా.. డోర్లు ఓపెన్ అవ్వడం....ఆ సౌండ్ విని.. గార్డ్ అక్కడకు వెళ్లి... ఎవరితోనో మాట్లాడటం చేస్తున్నాడు. అయితే...అక్కడ వీడియోలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు.  గార్డ్ మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు.

తర్వాత ఆటోమెటిక్ గా... ఓ వీల్ చైర్ లో కూర్చోపెట్టి... ఓ వైపు రూట్ చెప్పి.. అటు వెళ్లమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో... ఆ గార్డ్ దెయ్యంతోనే మాట్లాడాడు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్పత్రిలో చనిపోయిన పేషెంట.. దెయ్యంలా మళ్లీ వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

US-Iran War :ఈ రాత్రికి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి..? అసలు నిజమేంటి..?
Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?