జైలుశిక్ష: నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురికి ఏడేళ్లు

First Published Jul 6, 2018, 5:11 PM IST
Highlights

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురుకు కూడ ఏడేళ్లపాటు జైలు శిక్షను విధించింది. 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు పదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ పాక్ కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.  నవాజ్ కూతురు నవాజ్ కూతురు  మరియామ్ కు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 

అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు  కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది.  రిటైర్ట్ కెప్టెన్ సఫ్దర్‌కు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

 మహ్మద్  బషీర్ సుమారు వంద పేజీల తీర్పును శుక్రవారం నాడు చదివి విన్పించారు. ఈ కోర్టు తీర్పుకు సంబంధించిన వివరాలను  మీడియాకు శుక్రవారం నాడు సాయంత్రం విడుదల చేసింది.

ఈ తీర్పు వెలువడే సమయంలో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు కోర్టుకు హాజరుకాలేదు. కోర్టుకు హాజరుకాలేమని తమకు మినహాయింపు ఇవ్వాలని షరీఫ్, ఆయన కూతురు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.ప్రస్తుతం వీరిద్దరూ కూడ లండన్ లో ఉన్నారు.

click me!