మయన్మార్ లో కూలిన సైనిక విమానం.. బౌద్ధ సన్యాసితో సహా 12 మంది మృతి !

Published : Jun 11, 2021, 01:54 PM IST
మయన్మార్ లో కూలిన సైనిక విమానం.. బౌద్ధ సన్యాసితో సహా 12 మంది మృతి !

సారాంశం

మయన్మార్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

మయన్మార్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

న్యాపిడా నుంచి ఫైన్ ఓ -ఎల్విన్ పట్టణానికి వెల్తుండగా జరిగి ఈ దారుణ ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి కూడా ఉన్నట్టు సమాచారం. ఆయనతో సహా మొత్తం 12 మంది ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

ఫైన్ ఓ -ఎల్విన్ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుక వెల్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. 

ఈ ఘటనలో ఓ బాలుడు సహా మిలటరీకి చెందిన మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు మిలటరీకి చెందిన ఓ టీవీ ఛానల్ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !