సూపర్ మార్కెట్లో కాల్పులు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

Published : Jun 11, 2021, 07:53 AM IST
సూపర్ మార్కెట్లో కాల్పులు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

సారాంశం

ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి తుపాకీతో ప్రవేశించి.. ఇద్దరిని కాల్చి చంపేశాడు


అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ చప్పుళ్లు మారుమోగాయి. ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి తుపాకీతో ప్రవేశించి.. ఇద్దరిని కాల్చి చంపేశాడు. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని ఓ దుండగుడు ఇద్దరు వ్యక్తులను కాల్చిచంపి, తనను తాను కాల్చుకుని చనిపోయాడు. రాయల్ పామ్ బీచ్‌లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ మహిళ, ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. 

వారిద్దరినీ కాల్చిన అనంతరం దుండగుడు తనని తాను కాల్చుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని  పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం ప్రతినిధి తెరీ బార్బరికా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల గుర్తింపు వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి, మృతులకు ముందే తెలుసునని... వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. కాగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమామాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

18 వేల కిలోమీటర్ల దూరం దాడి చేసే మిస్సైల్ ఆ దేశ సొంతం.. మ‌రి భార‌త‌దేశం రేంజ్ ఏంటో తెలుసా.?
Iran: కోటి రూపాయ‌ల నోట్ విడుద‌ల చేసిన ఇరాన్‌..ఈ క‌రెన్సీ ఇండియాకు తెస్తే దాని విలువెంతో తెలుసా?