నా భార్యకు అలాంటి వీడియో పంపారు.. విలేకరుల ముందు బోరుమన్న పాక్ నేత (వీడియో)

Published : Nov 06, 2022, 05:14 PM ISTUpdated : Nov 06, 2022, 05:15 PM IST
నా భార్యకు అలాంటి వీడియో పంపారు.. విలేకరుల ముందు బోరుమన్న పాక్ నేత (వీడియో)

సారాంశం

పాకిస్తాన్‌కు చెందిన ఓ నేత ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి బోరున ఏడ్చేశారు. తన భార్యకు ఓ వ్యక్తి నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని తెలిపారు. ఆ ఫేక్ వీడియో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు వచ్చిందని నిన్న రాత్రి చెప్పిందని బోరున ఏడ్చేశారు.  

న్యూఢిల్లీ: కొన్నిసార్లు రాజకీయాలు ఊహించనలేనంతగా దిగజారిపోతాయి. మాన, ప్రాణాల విలువలేమీ లేకుండా మారుతాయి. ఒక మనిషిని ఎంత వేధించగలుగుతారో.. అంత పనీ చేస్తారు. పాకిస్తాన్‌లో ఇందుకు నిదర్శనంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నేత వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి.

పీటీఐ లీడర్, ఇమ్రాన్ ఖాన్‌కు విశ్వాసపాత్రుడైన 75 ఏళ్ల ఆజాం ఖాన్ స్వాతి విలేకరుల సమావేశం పెట్టారు. తన భార్యకు ఓ అభ్యంతరకర వీడియో వచ్చిందని అన్నారు. ఆజాం ఖాన్ స్వాతి, ఆయన భార్య ఇద్దరూ కాంప్రమైజింగ్ పొజిషన్‌లో ఉన్నట్టు ఆ వీడియోలో ఉన్నది. అలాంటి వీడియోను తన భార్యకు పంపించారని ఆయన తెలిపారు. ఈ వీడియో నకిలీ వీడియో అని, మార్ఫింగ్ చేశారని అన్నారు.

ఆజాం ఖాన్ స్వాతిని ఓ కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత నెల అరెస్టు చేసింది. బెయిల్ పై విడుదల చేసింది. జనరల్ ఖామర్ జావేద్ బజ్వాను ట్విట్టర్‌లో విమర్శించినందుకు ఆయనను అరెస్టు చేసింది. ఆ తర్వాత కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో టార్చర్ చేశారని, కొన్నిసార్లు బట్టలు తొలగించారని, అపహాస్యం చేశారని ఆరోపించారు. 

Also Read: హింసాత్మకంగా మారిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. అనేక మందికి గాయాలు, పలువురి అరెస్టు..

తాజాగా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమోషనల్‌ అయ్యారు. ఒకానొక దశలో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ.. ఆ వీడియో గురించి మాట్లాడుతూ బోరున విలపించారు. గత రాత్రి తన భార్యకు తనకు ఓ విషయం తెలిసిందని, గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు ఒక వీడియో వచ్చిందని అన్నారు. ఆ వీడియోలో తామిద్దరం శృంగారంలో ఉన్నట్టు ఉన్నదని పేర్కొన్నారు.

ఈ దేశ బిడ్డలు, మనవరాళ్లు తాను మాట్లాడేది వింటున్నారని, కాబట్టి, తాను అంతకు మించి మాట్లాడలేనని అంటూ కంట నీరు కార్చారు. 

తాను, తన భార్య క్వెట్టాకు పర్యటించిన సమయంలో ఈ వీడియోను తయారు చేశారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొందరికి తాను గిట్టనని, వారే ఈ పని చేయిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ వీడియోను ఫేక్ అని తేల్చేసింది. ఫొటోషాప్ పని అని స్పష్టం చేసింది. తమకు ఫిర్యాదు అందితే దర్యాప్తు చేస్తామని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !