
అమెరికాలో మరోసారి ముష్కరులు విధ్వంసం సృష్టించారు. ఫిలడెల్ఫియాలోని కెన్సింగ్టన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. కాల్పులు ఒకేసారి జరిగాయి, గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. కాల్పులకు కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదు. పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈస్ట్ అల్లెఘేనీ, కెన్సింగ్టన్ అవెన్యూ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే క్షతగాత్రుల పరిస్థితిపై ఇంకా పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. అంతే కాకుండా కాల్పులకు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
గతంలోనూ పలు ఘటనలు
అమెరికాలో ప్రతిరోజూ కాల్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు..(అక్టోబర్ 13న) దక్షిణ అమెరికా రాష్ట్రం నార్త్ కరోలినాలోని రాలీలో కాల్పుల కలకలం రేగింది. సమాచారం ప్రకారం.. ఒక నివాస ప్రాంతంలో కాల్పులు జరిగాయి, ఇందులో డ్యూటీ లేని పోలీసుతో సహా ఐదుగురు మరణించారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విచారం వ్యక్తం చేశారు. " కాల్పులు ఆపండి.ఈ సామూహిక కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అనేక కుటుంబాలకు మేము సానుభూతి మరియు ప్రార్థనలు చేస్తున్నాము" అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలను ఆయన ఖండించారు.అమెరికాలో తుపాకీ హింస ఎంతగానో జరుగుతోందని, అనేక హత్యలు వార్తల్లోకి రావని అన్నారు.
అలాగే.. గతంలో అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా నగరంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. బార్ లాంజ్‌లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్లబ్‌లో వాగ్వాదానికి దిగిన వ్యక్తుల మధ్య వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు.