యూకే‌లో ఇస్లాంలోకి మారాలని హిందూ క్లాస్‌మేట్స్‌కు చెబుతున్న ముస్లిం విద్యార్థులు..!

By Sumanth KanukulaFirst Published Apr 20, 2023, 7:29 PM IST
Highlights

బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక జాత్యహంకారం నిజం బట్టబయలైంది. పాఠశాలల్లో కొందరు ముస్లిం విద్యార్థులు వారి తోటి హిందూ క్లాస్‌మేట్స్‌ను మతం మారమని బెదిరిస్తున్నట్టుగా ఓ సర్వే నివేదిక పేర్కొంది. 
 

బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక జాత్యహంకారం నిజం బట్టబయలైంది. బ్రిటన్‌లో హిందూ ద్వేషంపై హెన్రీ జాక్సన్ సొసైటీ చేసిన మొదటి అధ్యయనంలో 51 శాతం మంది హిందూ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని అనుభవించారని నివేదించింది. ఆ సర్వే ప్రకారం.. బ్రిటన్‌లోని హిందూ విద్యార్థులు తరగతి గదుల్లో బెదిరింపు, జాతి వివక్షకు గురి అవుతున్నారు. అంతేకాకుండా జీవితాలను సులభతరం చేయడానికి హిందూ విద్యార్థులు మతాన్ని మార్చుకోవాలని ముస్లిం విద్యార్థులు చెబుతున్నారు. హిందువులు మతం మారాలని లేదా ‘‘అవిశ్వాసులకు నరకం బెదిరింపులు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని "కఫీర్" వంటి తీవ్ర పదాలను ముస్లిం విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. 

ఇక, హెన్రీ జాక్సన్ సొసైటీ అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ట్రాన్స్-అట్లాంటిక్ ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్. ఈ నివేదికలో 998 మంది హిందూ తల్లిదండ్రుల తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ పాఠశాలలను కవర్ చేసిన ఈ సర్వే కవర్ చేసింది. సర్వే చేయబడిన హిందూ తల్లిదండ్రులలో సగం మంది తమ పిల్లలు పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని అనుభవించారని నివేదించారు. అయితే సర్వే చేసిన పాఠశాలల్లో 1 శాతం కంటే తక్కువ మంది గత ఐదేళ్లలో హిందూ-వ్యతిరేక సంఘటనలను నివేదించారు.

ఈ సర్వే హిందువుల పట్ల వారి శాఖాహారాన్ని అపహాస్యం చేయడం, వారి దేవతలను కించపరచడం వంటి అనేక అవమానకరమైన ఘటనలు జరిగినట్టుగా సూచించింది. ‘‘"ఒక సందర్భంలో ఒక మహిళా హిందూ విద్యార్థిపై గొడ్డు మాంసం విసిరారు. హిందూ వ్యతిరేక బెదిరింపు కారణంగా ఒక మగ విద్యార్థి ఈస్ట్ లండన్ పాఠశాలలను మూడుసార్లు మార్చవలసి వచ్చింది. ఎనిమిది భౌతిక దాడులు వివరంగా ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. 

ఒక ఉదాహరణలో ఒక పిల్లవాడిని వేధించారు. వారు ఇస్లాంలోకి మారితే వారి జీవితం చాలా సులభం అవుతుంది అని చెప్పబడింది. మరొకరికి.. ‘‘మీరు చాలా కాలం జీవించలేరు... మీరు స్వర్గానికి వెళ్లాలనుకుంటే , మీరు ఇస్లాంలోకి రావాలి... హిందువులు ఆహార గొలుసులో దిగువన ఉన్న శాకాహారులు. మేము మిమ్మల్ని తింటాము’’ అని చెప్పబడింది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ పిల్లలు బహుళ దేవుళ్లను ఆరాధించడం వల్ల వారిని ఎగతాళి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు తెలిపినట్టుగా నివేదిక వెల్లడించింది. ఒక ఇస్లామిక్ బోధకుడి వీడియోలను చూడమని, ‘‘హిందూ మతానికి అర్థం లేదు కాబట్టి మతం మార్చుకోమని’’ పిల్లలకు చెప్పారని మరొక పేరెంట్ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. సర్వేలో పాల్గొన్నవారిలో 19 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ వ్యతిరేక ద్వేషాన్ని గుర్తించగలవని నమ్ముతున్నారు. 15 శాతం మంది హిందూ  తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ-వ్యతిరేక సంఘటనలను తగినంతగా పరిష్కరిస్తాయని భావిస్తున్నారు. 

click me!