26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయిద్‌కు జైలుశిక్ష

By Siva KodatiFirst Published Feb 12, 2020, 4:04 PM IST
Highlights

కరడుగట్టిన ఉగ్రవాది, 26/11 ముంబై దాడి ప్రధాని సూత్రధారి హఫీజ్ సయిద్‌కు పాకిస్తాన్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు హాఫీజ్ నిధులు సమీకరణ చేసినట్లుగా నిర్థారణ అవ్వడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

Also Read:హఫీజ్‌ సయీద్‌ ప్రసంగంపై పాక్ నిషేధం

పలు ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం అందిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయిద్‌పై నమోదైన కేసుకు సంబంధించి లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో హఫీజ్‌కు వ్యతిరేకంగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో సయిద్‌తో పాటు ఆయన ముగ్గురు అనుచరులు, ఉగ్రవాదులకు ఆర్ధిక వనరులు సమకూరుస్తున్నట్లు తేలింది. 2008 నవంబర్‌లో ముంబై రైల్వే స్టేషన్‌, తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

Also Read:భారత్‌ దెబ్బకు దిగొస్తున్న పాక్: హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం

ఈ ఘటనలో 164 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజేనని భారత్ ఎన్నో ఆధారాలు చూపించినప్పటికీ పాకిస్తాన్ వాటిని పట్టించుకోలేదు. 
 
click me!