పాక్ ఉగ్రవాదిని విడుదల చేయాలని వీరంగం.. పౌరులను బందీలుగా తీసుకుని భయాందోళనకు గురిచేసిన దుండగుడు..

By Sumanth KanukulaFirst Published Jan 16, 2022, 2:06 PM IST
Highlights

మరణాయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి నలుగురిని పౌరులను బందీలుగా చేసుకుని.. 10 గంటలకు పైగా భయానక వాతావరణం క్రియేట్ చేశాడు. దోషిగా తేలిన Pak Terroristని విడుదల చేయాలని వీరంగం సృష్టించాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.

మరణాయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి నలుగురిని పౌరులను బందీలుగా చేసుకుని.. 10 గంటలకు పైగా భయానక వాతావరణం క్రియేట్ చేశాడు. దోషిగా తేలిన Pak Terroristని విడుదల చేయాలని వీరంగం సృష్టించాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. అయితే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు.. ఆవ్యక్తిని మట్టుబెట్టి.. అతని చేతిలో బందీగా ఉన్న నలుగురిని క్షేమంగా రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. టెక్సాస్ పట్టణంలోని కొలీవిల్లేలో అనే చిన్న పట్టణంలో ఉన్న యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ వ్యక్తి ఆయుధాలతో ప్రవేశించాడు. అక్కడ మొత్తం నలుగరు వ్యక్తులను బందీలుగా చేసుకున్నాడు. తర్వాత ఓ వీడియోను విడుదల చేశాడు. 

అమెరికా అధికారులపై హత్యాయత్నం చేసిన కేసులో కోర్టు దోషిగా తేల్చిన న్యూరో శాస్త్రవేత్త  సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకుని ఎఫ్‌బీఐ టీమ్స్, స్థానిక పోలీసులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. పౌరులను బందీలుగా చేసుకున్న వ్యక్తితో సంప్రదింపులు జరిగిపారు. తొలుత బందీలుగా ఉన్నవారికి క్షేమంగా రప్పించే ప్రయత్నం చేశారు. కొద్ది గంటల తర్వాత ఆ వ్యక్తి బందీగా ఉన్నవారిలో ఒకరిని విడుదల చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని మట్టుబెట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. మిగిలిన ముగ్గురిని క్షేమంగా రక్షించారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. 

టెక్సాస్ గవర్నర్‌ Greg Abbott కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ప్రార్థనలు ఫలించాయి. బందీలందరూ సజీవంగా, సురక్షితంగా బయటపడ్డారు’ అని ట్వీట్ చేశారు. ఇక, FBI డల్లాస్ స్పెషల్ ఏజెంట్ మాట్ డిసార్నో మాట్లాడుతూ.. బందీలుగా ఉన్నవారు రక్షించబడ్డారని.. వారికి వైద్య సహాయం అవసరం లేదని, త్వరలోనే వారు కుటుంబాలతో తిరిగి కలుస్తారని చెప్పారు. అయితే అధికారుల విలేకరుల సమావేశానికి ముందు.. ప్రార్థన మందిరంలో భారీ పేలుడు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినట్టుగా ఘటన జరిగిన ప్రదేశంలోని జర్నలిస్టులు కొందరు రిపోర్ట్ చేశారు. 

ఇక, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. బందీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది. అయితే బందీలు ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బందీలందరినీ సురక్షితంగా విడిపించినందుకు.. యూఎస్‌లోని ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ హెర్జోగ్ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.

పాకిస్థాన్‌కు చెందిన మాజీ శాస్త్రవేత్త ఆఫియా సిద్ధిఖీని 2010లో ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా అధికారులపై హత్యాయత్నం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. ఆమెకు 86 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె ప్రస్తుతం కోలీవిల్‌కు సమీపంలో ఉన్న పోర్ట్ వర్త్ అనే నగరంలోని ఓ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే పౌరులను బందీలుగా తీసుకున్న వ్యక్తి సిద్దిఖీ సోదరుడనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలిసింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి తమ ప్రమేయం ఏమి లేదని aafia siddiqui తరపు న్యాయవాది Marwa Elbially..సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. పౌరులను బందీగా చేసుకున్న వ్యక్తి చర్యలను ఖండిస్తున్నట్టుగా వెల్లడించారు. 
 

click me!