క్రిస్మస్ వేడుకల సమయంలో.. అమెరికాలో భారీ పేలుడు

By telugu news teamFirst Published Dec 26, 2020, 8:23 AM IST
Highlights

ఈ పేలుడు ఉదయం పూట జరగడంతో.. పెద్దగా జనావాసం లేరని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి.

అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. టెన్నెసీ రాష్ట్రం నాష్ విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ వాహనంలో దుండగులు బాంబు అమర్చారు. దీంతో.. అది పేలిందని పోలీసులు తెలిపారు. బాంబు పేలుడు సంభవించిన ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయని పోలీసులు చెప్పారు. కానీ.. ఈ పేలుడు ఉదయం పూట జరగడంతో.. పెద్దగా జనావాసం లేరని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు గుర్తించారు. అయితే.. పేలుడు సంభవించిన ప్రాంతంలో మానవ శరీరానికి సంబంధించిన అవశేషాలు గుర్తించామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే.. అవి ఎవరివి అనేది మాత్రం ఇంకా గుర్తించలేదు. పేలుుడకి కారణమైన దుండగుడివే కావచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. పేలుడు జరగడానికి కొద్ది సేపటికి ముందు అక్కడ కాల్పులు జరగబోతున్నాయంటూ పోలీసులకు సమాచారం అందడం గమనార్హం. అంతలోనే బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు చెప్పారు. పోలీసులకు సమాచారం రాగానే.. సమీపంలోని భవానాలన్నింటినీ ఖాళీ చేయించారని.. దాని వల్లే ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు. 

click me!