Mossad: ఇరాన్ సైంటిస్టులతో వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌నే పేల్చేశారు.. మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్

By Pratap Reddy KasulaFirst Published Dec 3, 2021, 6:24 PM IST
Highlights

ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా విభాగం మొస్సాద్ ఏజెన్సీ.. ఇరాన్‌కు చెందిన సైంటిస్టులను రిక్రూట్ చేసుకుని వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌నే పేల్చేసింది. ఇరాన్ సైంటిస్టులను ఓ అంతర్జాతీయ అసమ్మతి సంస్థకు రిక్రూట్ చేసినట్టుగా నమ్మించారు. ఆ తర్వాత ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో వారిని భాగం చేసింది. అయితే, ఆ సీక్రెట్ ఆపరేషన్ వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌ను పేల్చేయడమేనని ఆ ఇరాన్ సైంటిస్టులకు తెలియదు.
 

న్యూఢిల్లీ: ప్రపంచ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలల్లో Isrealకు చెందిన Mossad అత్యుత్తమైమందనే పేరు ఉన్నది. సీక్రెట్ ఆపరేషన్స్(Secret Operations) చేపట్టడంలో మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దిట్ట అనే చర్చ ఉన్నది. తాజాగా, దీన్ని నిరూపిస్తూ మొస్సాద్ చేసిన ఓ సీక్రెట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. టాప్ ఇరాన్ సైంటిస్టులను ఓ అంతర్జాతీయ అసమ్మతి సంస్థకు రిక్రూట్ అయినట్టు నమ్మించి వారితోనే ఆపరేషన్ చేపట్టారు. తద్వార ఇరాన్ సైంటిస్టులతో వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌నే పేల్చేలా చేసినట్టు జూయిష్ క్రానికల్ అనే ఓ మీడియా కథనం వెల్లడించింది.

మొసాద్ సీక్రెట్ ఆపరేషన్‌లో నంతాజ్ న్యూక్లియర్ ఫెసిలిటీలో పేలుడు జరిగినట్టు ఆ పత్రిక తెలిపింది. మొత్తంగా ఈ నంతాజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ పేలుడులో మూడు ఘటనలకు మొస్సాద్‌తో లింక్ ఉన్నట్టు వివరించింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా న్యూక్లియర్ ప్లాంట్‌లోనీ కీలకమైన సెంట్రిఫ్యూజ్‌లు 90 శాతం ధ్వంసం అయినట్టు తెలిపింది. ఫలితంగా ఈ కాంప్లెక్స్ సుమారు 9 నెలలు వినియోగంలో లేకుండా పోయిందని పేర్కొంది. 

Also Read: Gaza: గాజాలోని హమాస్ సైట్లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ఈ మూడు ఆపరేషన్ల కోసం అమలు చేయడానికి మొస్సాద్ సుమారు 18 నెలల సమయం తీసుకున్నట్టు ది జూయిష్ క్రానికల్ వెల్లడించింది. ఇందులో సుమారు వెయ్యి మంది టెక్నిషియన్లు, గూఢచారులు, మరెందరో ఇతర ఏజెంట్లను రంగంలోకి దింపినట్టు తెలిపింది.

ఇరాన్ సైంటిస్టులనే స్వయంగా మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిక్రూట్ చేసుకుంది. అయితే, వారు ఒక అంతర్జాతీయ అసమ్మతి సంస్థకు రిక్రూట్ అయినట్టుగా విజయవంతంగా వారిని నమ్మించగలిగింది. తర్వాత వారితో సీక్రెట్ ఆపరేషన్ చేయించింది. కానీ, ఆ సీక్రెట్ ఆపరేషన్ వారి సొంత న్యూక్లియర్ ప్లాంట్‌ను పేల్చేయడమేనని ఆ ఇరాన్ సైంటిస్టులకు తెలియదు.

Also Read: మృత సముద్రం పక్కన నగ్నంగా 200 మంది మోడల్స్.. తెల్లరంగు పూసుకుని ఫొటోలకు పోజు

ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో పేలుడు పదార్థాలను డ్రోన్‌ల ద్వారా అక్కడికి సరఫరా చేసింది. ఈ డ్రోన్‌లను రిక్రూట్ చేసుకున్న ఇరాన్ సైంటిస్టులు కలెక్ట్ చేసుకున్నారు. అంతేకాదు, ఇంకా చాలా పేలుడు పదార్థాలను హైసెక్యూరిటీ ఉన్న ఆ న్యూక్లియర్ ప్లాంట్ కాంప్లెక్స్‌లోకి ఫుడ్ బాక్స్‌లు, లారీల్లో గుట్టుగా మొస్సాద్ పంపించినట్టు ఆ పత్రిక వెల్లడించింది. అంతేకాదు, 2019లో నంతాజ్ సెంట్రిఫ్యూజ్ నిర్మిస్తున్నప్పుడు అందుకు ఉపయోగించిన కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్‌లోనూ పేలుడు పదార్థాలను దాచి ఉంచినట్టు తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ అధీనంలోని గాజాలో బాంబులు వేసింది. ముఖ్యంగా హమాస్ ఆయుధాగారాలు, తయారీ కేంద్రాలపై బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దులోకి పంపుతున్న బెలూన్ పేలుళ్లకు ప్రతిగానే దాడి చేసినట్టు తెలిపింది. గత మే నెలలో కనీసం 11 రోజులు బాంబుల వర్షం కురిసింది. హమాస్ అధీనంలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి, ఇజ్రాయెల్ నుంచి గాజాపైకి బాంబులు కురిశాయి. ఇందులో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈజిప్ట్ ప్రమేయంతో ఇరుదేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరినప్పటికీ గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై బెలూన్‌లలో పేలుడు పదార్థాలను పంపాయి.

click me!