న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం, ఇద్దరు మృతి

Siva Kodati |  
Published : Mar 15, 2019, 09:02 AM IST
న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం, ఇద్దరు మృతి

సారాంశం

న్యూజిలాండ్‌ శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపాడు. 

న్యూజిలాండ్‌ శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగుడి కాల్పులపై న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజును బ్లాక్‌డేగా అభివర్ణించారు. దేశానికి వలస వచ్చిన వారిలో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌