అన్న ఆరేళ్లు.. తమ్ముడు మూడేళ్లు.. బొమ్మ కారు కొనేందుకు అసలు కారును నడుపుకుంటూ వెళ్లి.. 

By Rajesh KarampooriFirst Published May 12, 2023, 5:20 AM IST
Highlights

బొమ్మ కారు కొనేందుకని ఆరేళ్లు, మూడేళ్లున్న ఇద్దరు చిన్నారులు అసలైన కారు నడుపుకొంటూ రోడ్డుపైకి వచ్చిన ఘటన మలేషియా (Malaysia)లోని లంకావి ద్వీపంలో  జరిగింది. 

మలేషియాలోని లంకావి ద్వీపంలో  ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, చిన్నగాయాలయ్యాయి. అయితే.. ఈ కారులో ఇద్దరు పిల్లలు తప్ప మరెవ్వరూ లేదు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ఎక్కడున్నాడా? అని అక్కడున్నవారు వెతికి చూడగా.. అసలు విషయం తెలిసి.. అవాక్కయారు.  బొమ్మ కారు కొనడానికి ఆరేండ్ల  అన్నా, మూడు సంవత్సరాల తమ్ముడు ఇద్దరు కలిసి వారి తల్లిదండ్రులకు తెలియకుండా.. తమ కారును ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లారు. వారు కారును దాదాపు 2.5 కిలోమీటర్లు నడిపారు. చివరకు వాహనంపై అదుపు కోల్పోయి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులిద్దరూ పడుకున్న తరువాత అన్నదమ్ములిద్దరు గుట్టుచప్పుడు కాకుండా కారును బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. "కారును ఆరేళ్ల బాలుడు నడుపుతున్నాడు . అతని మూడేళ్ల సోదరుడు ప్యాసింజర్ సీటుపై కూర్చున్నాడు. ఉలు మెలక నుండి కంపుంగ్ నైయోర్ చబాంగ్ వైపు ప్రయాణిస్తుండగా, కారు అదుపు తప్పి నేరుగా ల్యాంప్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బానెట్‌ విరిగిపోయిందని పోలీసులు తెలిపారు.  తొలుత మద్యం మత్తులో డ్రైవర్ కారు నడిపి ప్రమాదానికి గురై ఉన్నట్టు ఉన్నారని భావించారు.  
 
ఇందుకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఆరేళ్ల చిన్నారి టీ-షర్ట్ ,ఎరుపు రంగు ప్యాంటు ధరించి కారు నడుపుతున్నాడు. బొమ్మ కారు కొనుక్కుంటాం అని పిల్లలు కారులోంచి అరుస్తున్నారు. ఆరేళ్ల పిల్లాడు చెప్పాడు- "అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు . మేము బొమ్మల దుకాణానికి వెళ్తున్నాము." అని తెలిపాడు.  "మేము నల్ల కారు కొనబోతున్నాం." అని మూడు సంవత్సరాల పిల్లవాడు చెప్పాడు. ఇద్దరు అన్నదమ్ముల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. పెద్ద పిల్లవాడికి గడ్డం మీద గాయమైందని, తమ్ముడు సురక్షితంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు .

click me!