బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణ స్వీకారం..

By SumaBala BukkaFirst Published Apr 24, 2023, 2:58 PM IST
Highlights

ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికార అవామీ లీగ్ అభ్యర్థిగా మహ్మద్ షహబుద్దీన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నాడు బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశాడు.

ఢాకా : బంగ్లాదేశ్‌ 22వ అధ్యక్షుడిగా ప్రముఖ రాజకీయ నాయకుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.బంగాబాబన్‌లోని చారిత్రక దర్బార్ హాల్‌లో స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి 73 ఏళ్ల షహబుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, కొత్త అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్, సైనిక అధికారులు హాజరయ్యారు.

ఆదివారంతో పదవీకాలం ముగిసిన అబ్దుల్ హమీద్ స్థానంలో షహబుద్దీన్ నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం షహబుద్దీన్ రాష్ట్రపతి పదవికి సంబంధించిన ప్రమాణ పత్రాలపై సంతకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికార అవామీ లీగ్ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ పదవి అలంకారప్రాయమైనదే అయినప్పటికీ, రాష్ట్రపతి కార్యాలయం ప్రత్యేకించి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రిని నియమించి, దేశానికి రాజ్యాంగ సంరక్షకుడిగా ఉంటుంది. ఎన్నికల వ్యవస్థపై అధికార అవామీ లీగ్, దాని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య బంగ్లాదేశ్ డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో సాధారణ ఎన్నికలకు సిద్ధమైంది.

వార్నీ.. చీరల కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..

గత వారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దిగువ కోర్టు న్యాయమూర్తి షహబుద్దీన్, ఓటర్లు తమ ఓటు వేయడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం చాలావరకు ఎన్నికల సంఘం బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ సంస్థ తన పాత్రను పోషిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తన పదవిని చేపట్టిన తర్వాత రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తానని, రాజకీయ పార్టీల మధ్య వివాదాలను తగ్గించడంలో ఏదైనా పాత్ర పోషించాల్సిన అవసరం ఉందో లేదో అంచనా వేస్తానని చెప్పారు.

1949లో జన్మించి, వాయువ్య పాబ్నా జిల్లాకు చెందిన షహబుద్దీన్ రిటైర్డ్ జిల్లా జడ్జి, ఆ తర్వాత స్వతంత్ర అవినీతి నిరోధక కమిషన్ కమిషనర్‌లలో ఒకరిగా పనిచేశారు. తరువాత రాజకీయాల్లో చేరారు. సీనియర్ పార్టీ నాయకులు, సాంకేతిక నిపుణులతో కూడిన అవామీ లీగ్ సలహా మండలిలో సభ్యుడిగా మారాడు, అయితే అత్యున్నత పదవికి ఆయన ఎన్నిక కావాలంటే పార్టీ పదవిని వదులుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

షహబుద్దీన్ అవామీ లీగ్ విద్యార్థి, యువజన విభాగానికి నాయకుడు,  1971 విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1975లో ప్రధాన మంత్రి హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత అతను జైలు పాలయ్యాడు. 1982 లో,  దేశ న్యాయసేవలో చేర్చబడ్డాడు. షహబుద్దీన్ భార్య రెబెకా సుల్తానా ప్రభుత్వ మాజీ సంయుక్త కార్యదర్శి. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

click me!