కరోనా టీకా: క్లినికల్ ట్రయల్స్ బ్లూప్రింట్ విడుదల చేసిన మోడెర్నా, ఫైజర్

By narsimha lode  |  First Published Sep 18, 2020, 1:23 PM IST

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రణాళికను మోడెర్నా, ఫైజర్ కంపెనీలు బయటపెట్టాయి.కరోనాపై వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచంలోని పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.  రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ టీకాపై పలు సంస్థలు సందేహాలను వ్యక్తం చేశాయి.



వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రణాళికను మోడెర్నా, ఫైజర్ కంపెనీలు బయటపెట్టాయి.కరోనాపై వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచంలోని పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.  రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ టీకాపై పలు సంస్థలు సందేహాలను వ్యక్తం చేశాయి.

దీంతో మోడెర్నా, ఫైజర్ కంపెనీలు బ్లూప్రింట్ ను విడుదల చేశాయి. 135 పేజీల సమాచారాన్ని ఈ కంపెనీలు విడుదల చేశాయి.ఈ ప్రయోగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కంపెనీలు గోప్యంగా ఉంచుతాయి. ప్రయోగాలు పూర్తైన తర్వాతే వాటిని విడుదల చేస్తాయి. 

Latest Videos

undefined

వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేవారిని ఎంచుకొనే విధానం, పర్యవేక్షణ, ప్రయోగాల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రయోగాలను త్వరగా నిలిపివేసేందుకు అనుసరించే పద్దతులను బ్లూప్రింట్ లో ప్రస్తావిస్తారు.

ప్రయోగాలు సాగుతున్న సమయంలో బ్లూప్రింట్ విడుదల చేయడం అత్యంత సాధారణ విషయంగా చెబుతారు.కరోనా నివారణకు తయారు చేస్తున్న టీకాకు సంబంధించిన ప్రయోగాల పూర్తి ప్రయోగాలను ఫలితాలను విశ్లేషించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న తొమ్మిది కంపెనీల్లో రెండు కంపెనీలు మాత్రమే బ్లూప్రింట్ ను విడుదల చేశాయి. 

మోడెర్నా 30 వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 25 వేల మందిపై ప్రయోగాలు పూర్తి చేసినట్టుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఫైజర్ 44 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. వీరిలో ఇప్పటికే 30 వేల మందిపై ప్రయోగాలు జరిపింది.

click me!