కారణమిదీ: భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు

Published : Sep 17, 2020, 05:15 PM IST
కారణమిదీ:  భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు

సారాంశం

తనతో విడిపోయిన భార్యను హత్య చేసినందుకు గాను భారత సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదును విధించింది యూకే కోర్టు.జిగుకుమార్ సోర్తికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది. 


లండన్: తనతో విడిపోయిన భార్యను హత్య చేసినందుకు గాను భారత సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదును విధించింది యూకే కోర్టు.జిగుకుమార్ సోర్తికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది. 21 ఏళ్ల భవిని ప్రవిణ్ ను హత్య చేసినందుకు గాను ఈ శిక్ష విధించింది.  మార్చి మాసంలో లీస్టెర్ లో ఆమె కత్తిపోట్లకు గురై మరణించింది.

21 ఏళ్ల వయస్సున్న భవిని ప్రవిణ్ ని అత్యంత క్రూరంగా దయలేకుండా హత్య చేసినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. మార్చి 2వ తేదీ పన్నెండున్నర గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు.ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తనతో తెచ్చుకొన్న కత్తితో ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు.

స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.ఈ ఘటన జరిగిన రెండు గంటలలోపు  జిగుకుమార్ సోర్తి పోలీసులకు  లొంగిపోయాడు. పలుమార్లు కత్తిపోట్లతో భవిని ప్రవిణ్ భవిని ప్రవిణిని మృతి చెందినట్టుగా పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది.

అతి చిన్న వయస్సులోనే భవిని ప్రవిణ్ మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్నినింపుతోంది. అయితే నిందితుడికి శిక్ష పడడం ఆ కుటుంబానికి ఊరటనిచ్చే అంశంగా కోర్టు అభిప్రాయపడింది.

ఈ కేసు విచారణ సమయంలో కుటుంబసభ్యులు హాజరుకావడం అత్యంత కష్టమైన విషయంగా కోర్టు అభిప్రాయపడింది.  హత్యకు ఒక్క రోజు ముందే జిగుకుమార్ సోర్తితో పెళ్లికి భవిని ప్రవిణి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతోనే అతను ఈ హత్యకు పూనుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?