కరోనాపై జపాన్ విజయం.. లాక్ డౌన్ లేకుండా ఎలా సాధ్యమైందంటే..

By telugu news teamFirst Published May 26, 2020, 8:37 AM IST
Highlights

ఎలాంటి లాక్‌డౌన్‌లు లేకుండా.. రెస్టారెంట్ల నుంచి హెయిర్‌ సెలూన్ల దాకా అన్నీ తెరిచే ఉన్నాయి. టెస్టుల సంఖ్యా తక్కువే. కానీ.. వెయ్యిలోపు మరణాలతో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా నిరోధించగలిగింది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ కి పుట్టిల్లు అయిన చైనాలో ఆ మధ్య కరోనా కేసులు తగ్గినట్లే అనిపించినా.. తిరిగి మళ్లీ వ్యాపించడం మొదలైంది. అయితే.. జపాన్ మాత్రం ఈ వైరస్ ని జయించింది.

ఎలాంటి లాక్‌డౌన్‌లు లేకుండా.. రెస్టారెంట్ల నుంచి హెయిర్‌ సెలూన్ల దాకా అన్నీ తెరిచే ఉన్నాయి. టెస్టుల సంఖ్యా తక్కువే. కానీ.. వెయ్యిలోపు మరణాలతో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా నిరోధించగలిగింది. సోమవారం నుంచి ఆ దేశం అత్యవసర స్థితిని ఎత్తివేసింది. అక్కడ కరోనా నియంత్రణలోకి రావడానికి కారణాలేంటి?

జపనీయుల భాష ఉచ్చారణ కూడా అక్కడ కరోనా వ్యాప్తి నిరోధానికి కారణమని తెలుస్తోంది. పైగా.. అక్కడ ఊబకాయుల సంఖ్య తక్కువ. జపనీయులంతా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కుల ధారణ వారికి సాధారణం. ఈ కారణాలతో ఆ దేశంలో కరోనా మరణాలు వెయ్యిలోపే నమోదయ్యాయి. రికవరీ శాతం కూడా ఇతర దేశాలతో పోలిస్తే.. చాలా ఎక్కువ. వైరస్‌ బారిన పడ్డవారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను గుర్తించేందుకు పలు దేశాలు డిజిటల్‌ టెక్నాలజీని వినియోగించాయి. ప్రత్యేక యాప్‌లను వాడాయి.


కానీ, జపాన్‌లో అనలాగ్‌ పద్ధతిలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేశారు. 2018లోనే ఆ దేశం అంటువ్యాధులపై పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో నర్సుల్ని నియమించుకుంది. ఒక వ్యక్తికి కొవిడ్‌-19 నిర్ధారణ కాగానే.. నర్సులు వారి కాంటాక్ట్‌ను గుర్తించి, వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణాలతో జపనీయులపై వైరస్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

click me!