మైక్రో సాఫ్ట్ కి 23 బిలియన్ డాలర్ల నష్టం

By Galam Venkata Rao  |  First Published Jul 19, 2024, 6:36 PM IST

మైక్రోసాఫ్ట్‌లో ప్రధాన ఐటీ లోపం కారణంగా విపరీతమైన అంతరాయం ఏర్పడింది. ఇది విమానాల రద్దు, టీవీ చానల్స్, ఇలా అనేక సేవలను ప్రభావితం చేసింది. ఈ లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ £18 బిలియన్ ($23 బిలియన్) మేర పడిపోయింది.

 


మైక్రోసాఫ్ట్ కంపెనీ ఐటీ వ్యవస్థ లోపం కారణంగా  ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీగా నష్టపోయింది. 

టెక్ దిగ్గజం షేర్ ధర 0.71% పడిపోవడంతో కంపెనీ సుమారు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 

Latest Videos

undefined

ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాక్‌లిటిక్స్ నుంచి అందిన విశ్లేషణ ప్రకారం, మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు నుండి $443.52 (£343.44) నుంచి ఈరోజు, జూలై 19న 10.09 గంటలకు $440.37 (£341) కి పడిపోయింది.

యాపిల్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా మైక్రోసాఫ్ట్ ఉంది. ఐటీ అవుటేజ్ కు ముందు దాని మార్కెట్ విలువ $3.27 ట్రిలియన్ (£2.53 ట్రిలియన్) గా ఉంది. దాని షేర్ ధర ప్రతి 0.1% పడినపుడు, దాని కంపెనీ విలువ సుమారు $3.33 బిలియన్ (£2.58 బిలియన్) తగ్గిపోతుంది.

ఈ సందర్భంగా స్టాక్‌లిటిక్స్‌ ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కు ఇలా ఐటీ లోపం కలగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు నిలిచిపోవడం, టీవీ చానల్స్ ఆగిపోవడం, ఇలా అనేక సేవల్లో విస్తృతంగా అంతరాయం ఏర్పడటానికి ఈ సాంకేతిక లోపం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువపై నేరుగా ప్రభావం చూపింది. శుక్రవారం ఉదయం మాత్రమే £18 బిలియన్ల ($23 బిలియన్ల) నష్టాన్ని చూసింది. ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్ సిస్టమ్స్‌ మైక్రోసాఫ్ట్‌పై ఆధారపడి ఉన్నందు వల్ల ఆ కంపెనీ కోల్పోయిన విలువను తక్కువ సమయంలోనే తిరిగి పొందాలి. ఏది ఏమైనప్పటికీ, మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ కంపెనీల్లో అవుటేజ్ ప్రభావం పెట్టుబడిదారులపై కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

click me!